Telangana: తెలంగాణలో కల్వకుంట్ల కుబుంబ పాలన నడుస్తోంది.. కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్..

|

Sep 25, 2022 | 2:49 PM

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ నాయకులు విమర్వలు గుప్పిస్తుంటే.. కేంద్రంలో బీజేపీ పాలనపై టీఆర్ ఎస్ నాయకులు మండిపడుతున్న విషయం..

Telangana: తెలంగాణలో కల్వకుంట్ల కుబుంబ పాలన నడుస్తోంది.. కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్..
Kishan Reddy
Follow us on

Telangana: తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ నాయకులు విమర్వలు గుప్పిస్తుంటే.. కేంద్రంలో బీజేపీ పాలనపై టీఆర్ ఎస్ నాయకులు మండిపడుతున్న విషయం తెలిసిందే. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రజలను కలిసే సమయం సీఏంకు లేదని అన్నారు. ప్రజలను అన్ని విషయాల్లో కేసీఆర్ మోసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని అందుకే జాతీయ రాజకీయాలు అంటున్నారని ఎద్దెవా చేశారు. అప్పులు కావాలని కేంద్రప్రభుత్వాన్ని కేసీఆర్‌.. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. తన వైఫల్యాల నుంచి తప్పించుకోవడం కోసం కేంద్రప్రభుత్వం పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని కిషన్ రెడ్డి, సీఏం కేసీఆర్ పై మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇవ్వకుండా.. ఇంట్లో ఈగల మోద.. బయట పల్లకిలా మోత అన్నట్లు టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన రాయితీలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు కిషన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..