Watch Video: ఏంటి ఈ ఘోరం.. చివరికి అత్తని కూడా వదలని అల్లుడు.. ఏం చేశాడంటే..

| Edited By: Srikar T

May 25, 2024 | 9:45 PM

కుటుంబం, సంసారం అన్నాక గొడవలు సహజం. గొడవలు లేని ఇల్లే ఉండదు. ఎన్ని గొడవలు వచ్చినా అర్థం చేసుకుని సర్దుకుపోతేనే ఆ సంసారం ముందుకు వెళ్తుంది. కానీ ఇక్కడ ఒక కుటుంబం మాత్రం ఆ గొడవలని పోలీసు కేసు నమోదయ్యే వరకూ తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నగరం పాతబస్తీ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Watch Video: ఏంటి ఈ ఘోరం.. చివరికి అత్తని కూడా వదలని అల్లుడు.. ఏం చేశాడంటే..
Dowry Case
Follow us on

కుటుంబం, సంసారం అన్నాక గొడవలు సహజం. గొడవలు లేని ఇల్లే ఉండదు. ఎన్ని గొడవలు వచ్చినా అర్థం చేసుకుని సర్దుకుపోతేనే ఆ సంసారం ముందుకు వెళ్తుంది. కానీ ఇక్కడ ఒక కుటుంబం మాత్రం ఆ గొడవలని పోలీసు కేసు నమోదయ్యే వరకూ తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నగరం పాతబస్తీ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న భార్యభర్తల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి.

పలుమార్లు ఇలా గొడవలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఆ ఇద్దరు దంపతులకు నచ్చజెపుతూనే ఉన్నారు. అయినా ఫలితం లేదు. ఇలా ఎప్పటికప్పుడు సమస్యకు పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ల సంసారం మాత్రం అలాగే గొడవలతో ముందుకు సాగుతుంది. దీంతో ఆ భార్యకు ఓపిక నశించి భర్తపై వరకట్నం కేసు వేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను పిలిపించి విచారించారు. ఇలా తన భార్య తనపై కేసు వేయడం ఓర్చుకోలేని అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్య, బామ్మర్దులతో పాటు చివరికి అత్తను కూడా చితకబాదాడు. తీవ్ర గాయాల పాలైన భార్య, అత్త, బామ్మర్ది ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య చికిత్సల అనంతరం భర్త తమపై మరోసారి దాడి చేశారంటూ పోలీసులకు మరో ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..