Koushik Reddy: “నా దగ్గర అందరి జాతకాలు ఉన్నాయి..” ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణ

| Edited By: Balaraju Goud

Oct 29, 2024 | 4:51 PM

బర్త్‌డే మొదలైన కొద్దిసేపటికి ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు సిఐలు, సుమారు 100 మంది పోలీసులు అక్కడికొచ్చి చుట్టుముట్టారని చెప్పారు కౌశిక్ రెడ్డి.

Koushik Reddy: నా దగ్గర అందరి జాతకాలు ఉన్నాయి.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణ
Paddy Koushik Reddy Mla
Follow us on

బీఆర్ఎస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ కౌశిక్ రెడ్డి మరో సంచలన ఆరోపణతో ముందుకు వచ్చారు. తాజాగా కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ పైన దాడి జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు కొంత విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు.. ఒక వ్యక్తి శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు. రాజకీయ పార్టీల మధ్య వార్ గా మారింది. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడు అంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అసలు అక్కడ ఏం దొరక్కుండానే రాజకీయ కక్షలతో ఇలాంటి దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.

ఇది కొనసాగుతుండగానే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి కుట్రనే జరిగిందంటూ మీడియా ముందుకు వచ్చారు. 20 రోజుల క్రితం తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్తే, ఇలాగే ఇరికించేందుకు ప్రయత్నించారంటూ ఆరోపించారు. సర్ప్రైజ్ బర్త్డే పార్టీ కావడంతో ముందుగా ఎవరికీ సమాచారం లేదు. కారులో ఎక్కిన తర్వాతే డ్రైవర్ కి ఆ బర్త్‌డే పార్టీ జరుగుతున్న ప్లేస్ అడ్రస్ చెప్పానన్నారు. కానీ, పోలీసులు తన ఫోన్ టాప్ చేసి ఆ పార్టీ విషయం తెలుసుకున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

బర్త్‌డే మొదలైన కొద్దిసేపటికి ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు సిఐలు, సుమారు 100 మంది పోలీసులు అక్కడికొచ్చి చుట్టుముట్టారని చెప్పారు కౌశిక్ రెడ్డి. అంతేకాదు పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తిని సోదా చేశారన్నారు. తన కారు తో సహా తనను కూడా తనిఖీ చేశారని కౌశిక్ రెడ్డి తెలిపారు. అక్కడ డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారం వస్తుందంటూ పోలీసు అధికారులు చెప్పారన్నారు. కానీ డ్రగ్స్ తీసుకొచ్చి మమ్మల్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తారని అనుమానం ఆరోజే వచ్చిందన్నారు. గట్టిగా ప్రతిఘటించేసరికి పోలీసులు ఏమీ దొరకలేదని వెళ్లిపోయారంటున్నారు కౌశిక్.

అసలు తనకు మద్యం తాగి అలవాటే లేదు, స్మోకింగ్ అలవాటు కూడా లేదు.. అలాంటిది తాను డ్రగ్స్ ఎలా వాడతాను అంటూ గట్టిగా పోలీసులతో వాదించారన్నారు. ఈ విషయం ద్వారా పోలీసులు తమ ఫోన్లు టాప్ చేస్తున్న విషయం అర్థమైందని, ఆరోజు కచ్చితంగా డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందుకే పోలీసులు ప్రయత్నం చేశారని ఆరోపించారు. అంతేకాదు కౌశిక్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలందరం బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏ ఆస్పత్రికైనా అందరం కలిసి వెళ్దాం అంటూ ఛాలెంజ్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల జాతకాలు తనకు తెలుసని, ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో సమాచారం ఉందన్నారు కౌశిక్ రెడ్డి. బయట పెట్టమంటారా అంటూ కామెంట్స్ చేశారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం తనకి ఇష్టం లేదన్న కౌశిక్, చెప్పడం లేదంటూ.. రాజకీయ కక్షతో ఇలాంటి కుట్రలు చేస్తే సహించమంటూ హెచ్చరించారు కౌశిక్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..