Telangana: జైల్లో వేస్తే వేసుకో.. యోగా చేసుకుంటా: కేటీఆర్

| Edited By: Velpula Bharath Rao

Nov 07, 2024 | 4:52 PM

ఫార్ములా ఈ రేసింగ్‌లో వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. జైలులో వేస్తే వేసుకోవాలని.. తనకేం ఫరక్ పడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు పంపిస్తే రోజు యోగా చేసి మరింత ఫిట్‌గా తయారవుతానంటూ సెటైర్లు వేశారు.

Telangana: జైల్లో వేస్తే వేసుకో.. యోగా చేసుకుంటా: కేటీఆర్
Brs Leader Ktr Responds On Corruption In The Management Of The Formula E Race
Follow us on

మాజీ మంత్రి కేటీఆర్‌ తనపై ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రెస్‌‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైలులో వేస్తే వేసుకో.. తనకేం ఫరక్ పడదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మూడు నెలలు కసరత్తులు చేసి టిమ్‌గా తయారై పాదయాత్ర చేస్తానన్నారు. ఫార్ములా ఈ రేసింగ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్.. ఈ ఆరోపణల నేపథ్యంలో రాజ్ భవన్లో కేటీఆర్ అరెస్టు కోసం అనుమతి తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఫార్ములా ఈ రేసింగ్ కోసం కేటీఆర్ హెచ్ఎండీఏ నిధులను 55 కోట్లు దారి మళ్లించారని ఆరోపణలు ప్రభుత్వం చేస్తుంది. దీనిపై నిజాలు తేల్చి దోషులను శిక్షిస్తామంటున్నారు ప్రభుత్వ పెద్దలు.. సీఎం రేవంత్ రెడ్డి కూడా పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

దీంతో ఈరోజు అసలు ఫార్ములా ఈ రేసింగ్లో ఏం జరిగిందో తనే చెప్తానంటూ మీడియా ముందుకు వచ్చారు కేటీఆర్.. 55 కోట్లు ఫార్ములా వన్ రేసింగ్ కోసం ఆ కంపెనీకి ఇవ్వమని చెప్పింది తనే అని.. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా తనకున్న అధికారులతో ఇచ్చానని అంగీకరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఆ డబ్బుల్ని చెల్లించినట్లు స్పష్టం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగ్ రద్దు చేయడంతో ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూరిందన్నారు. కేసులు పెడితే ఇప్పుడున్న ప్రభుత్వంపై పెట్టాలని, తనపై ఏం కేసులు పెడతారంటూ ప్రశ్నించారు. అంతేకాదు కేసులకు భయపడేది లేదని, జైలుకు పంపిస్తాను అంటే పంపించుకోండి అంటూ సవాల్ విసిరారు. జైలుకు పంపిస్తే రోజు యోగా చేసి మరింత ఫిట్‌గా తయారవుతానంటూ సెటైర్లు వేశారు. జైల్లో ఫిట్నెస్ పెంచుకొని బయటకు వచ్చి పాదయాత్ర మొదలు పెడతానని ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి