AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టిన అక్క! కన్నీళ్లు పెట్టించే ఘటన

మహబూబాబాద్ జిల్లా కురవిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రమేశ్‌ (36) అనారోగ్యంతో మృతి చెందగా, అంత్యక్రియల సమయంలో సోదరి ధనలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టారు. పది రోజుల క్రితమే రమేశ్‌ తండ్రి వీరన్న కూడా మృతి చెందారు.

తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టిన అక్క! కన్నీళ్లు పెట్టించే ఘటన
Sister Ties Rakhi To Brothers Dead Body
SN Pasha
|

Updated on: Aug 27, 2026 | 6:20 AM

Share

మహబూబాబాద్‌ జిల్లా కురవిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాఖీ పండుగకు ముందే తమ్ముడు మృతి చెందడంతో ఓ అక్క కన్నీరుమున్నీరుగా విలపించింది. తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. కురవి గ్రామానికి చెందిన మోటపోతుల రమేశ్‌ (36) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల సమక్షంలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

అంత్యక్రియల సమయంలో రమేశ్‌ సోదరి ధనలక్ష్మి తన తమ్ముడి మృతదేహం వద్దకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘రాఖీ కట్టక ముందే పాడెనెక్కావా తమ్ముడూ’ అంటూ రోదిస్తూ పాడెపై ఉన్న రమేశ్‌ చేతికి రాఖీ కట్టారు. తమ్ముడికి రాఖీ కట్టి ఆశీర్వదించాల్సిన సమయంలో, అతడి మృతదేహానికి రాఖీ కట్టాల్సి రావడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది.

ఇదిలా ఉండగా, రమేశ్‌ తండ్రి వీరన్న కూడా పది రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి మరణించిన పది రోజులకే కుమారుడు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో కొద్ది రోజుల వ్యవధిలో వరుసగా రెండు మరణాలు సంభవించడంతో బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వచ్చిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టిన అక్క! కన్నీళ్లు పెట్టించే ఘటన
తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టిన అక్క! కన్నీళ్లు పెట్టించే ఘటన
ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్..
ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..