Telangana: రచ్చకు దారి తీసిన మటన్‌ ముక్క.. గరిటెలు, కర్రలతో కొట్లాట..

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో వివాహం జరిపించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. అయితే ఇదే సమయంలో వరుడి తరఫున వచ్చిన కొందరు యువకులకు మటన్‌ను వడ్డించారు దీంతో తమకు మటన్‌ ముక్కలు...

Telangana: రచ్చకు దారి తీసిన మటన్‌ ముక్క.. గరిటెలు, కర్రలతో కొట్లాట..
Mutton Curry
Follow us

|

Updated on: Aug 29, 2024 | 9:31 AM

కొన్ని సందర్భాల్లో సిల్లీ కారణాలు కూడా పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. చాలా వరకు గొడవలు ఇగో కారణంగా జరుగుతుంటాయి. ఒక చిన్న మటన్‌ బొక్క కూడా గొడవకు దారి తీస్తుంది. బలగం సినిమాలో సన్నివేశం అందిరికీ గుర్తుండే ఉంటుంది. నల్లి బొక్క వేయలేదన్న కారణంతో రెండు కుటుంబాలు ఏళ్లపాటు దూరమవుతాయి. అయితే ఇది కేవలం సినిమాకే పరిమితం కాలేదు, నిజ జీవితంలో సైతం ఇలాంటి ఓ సంఘటన జరిగింది. మటన్‌ కూర ఇరు కుటుంబాల మధ్య దాడులు చేసుకునే పరిస్థితికి దారి తీసింది.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో వివాహం జరిపించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. అయితే ఇదే సమయంలో వరుడి తరఫున వచ్చిన కొందరు యువకులకు మటన్‌ను వడ్డించారు దీంతో తమకు మటన్‌ ముక్కలు సరిగ్గా వేయలేదంటూ యువకులు ఆరోపించారు. ఇది కాస్త తీవ్ర వాగ్వాదానికి దారి తీస్తుంది.

వెంటనే వధువు తరఫు బంధువులు సైతం రంగంలోకి దిగారు. దీంతో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాక పరిస్థితి చేరింది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మంది, మరో వర్గానికి చెందిన పత్రి సాయిబాబాతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
కేఎల్ రాహుల్‌కు లక్నో షాక్.. కెప్టెన్సీ నుంచి తొలగింపు!
కేఎల్ రాహుల్‌కు లక్నో షాక్.. కెప్టెన్సీ నుంచి తొలగింపు!
స్నానం చేసే నీటిలో వీటిని కలిపి చేస్తే అదృష్టమే అదృష్టం..
స్నానం చేసే నీటిలో వీటిని కలిపి చేస్తే అదృష్టమే అదృష్టం..
శ్రీకాళహస్తి సోషల్‌ టీచర్‌ను వరించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
శ్రీకాళహస్తి సోషల్‌ టీచర్‌ను వరించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
రెడ్ డ్రెస్ లో బన్నీ వాక్స్ అందాలు.. పిక్స్ వైరల్
రెడ్ డ్రెస్ లో బన్నీ వాక్స్ అందాలు.. పిక్స్ వైరల్
బ్రిటన్ రాణి విక్టోరియా ఇష్టపడిన మధుర పెడ గురించి తెలుసా..
బ్రిటన్ రాణి విక్టోరియా ఇష్టపడిన మధుర పెడ గురించి తెలుసా..
2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్ సిగ్నల్
2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్ సిగ్నల్
రేస్ లో నుండి తప్పుకున్న కంగువ !! సోలోగా రానున్న సూపర్ స్టార్
రేస్ లో నుండి తప్పుకున్న కంగువ !! సోలోగా రానున్న సూపర్ స్టార్
మరోసారి 'డీప్ ఫేక్’ బారిన కింగ్ కోహ్లీ.. ఏకంగా అలా చూపించారేంటి?
మరోసారి 'డీప్ ఫేక్’ బారిన కింగ్ కోహ్లీ.. ఏకంగా అలా చూపించారేంటి?