Laxman: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే.. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి.. బీజేపీ డిమాండ్

|

Mar 28, 2024 | 2:03 PM

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ తరుణంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌.. కేటీఆర్‌ మాటలను బట్టి.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నారని గుర్తు చేశారు.

Laxman: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే.. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి.. బీజేపీ డిమాండ్
Laxman
Follow us on

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ తరుణంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌.. కేటీఆర్‌ మాటలను బట్టి.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటేనని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని డాక్టర్‌ లక్ష్మణ్‌ విమర్శించారు. గురువారం బీజేపి రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. పోలీసులేమో నేతలు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశామని అంటున్నారని.. కెటిఆర్ ఒక్కరిద్దరి ఫోన్లు ట్యాప్ అయ్యి ఉండొచ్చు అని మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటిలు అమలు చేయకుండా.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇటువంటివి వాటిని తెర మీదకి తెస్తున్నారనే అనుమానం కల్గుతుందన్నారు. బీఆర్ఎస్ అవినీతి ఎక్కడ బయట పడతాది అనే అభద్రత భావంతో కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.

ఉప ఎన్నిక ల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసారంటూ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కి మూల కారణం కేసిఆర్ అని కాంగ్రెస్ చెప్తుందని.. దీని వెనకాల ఉన్న వారందరూ బయటికి రావాలంటే ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ ఎంక్వయిరీకి అప్పజెప్పి రేవంత్ లీకువీరుడు కాదు గ్రీకువీరుడు అని నిరూపించుకోవాలన్నారు.. తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందో లేదో విచారణ జరిపి తేల్చాలని డిమాండ్ చేశారు.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. ఇదే కేసు విషయంలో కీలక విషయాలను బయట పెట్టాలని రఘునందనరావు కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..