Trs vs Congress: హీటెక్కిస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పొలిటికల్ వార్.. ఇవి మామూలు కామెంట్స్ కాదండోయ్..!

|

Jun 28, 2022 | 9:32 AM

Bhadradri Kothagudem Trs: పినపాక TRS ఎమ్మెల్యే రేగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది.

Trs vs Congress: హీటెక్కిస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పొలిటికల్ వార్.. ఇవి మామూలు కామెంట్స్ కాదండోయ్..!
Trs Vs Congress
Follow us on

Bhadradri Kothagudem Trs: పినపాక TRS ఎమ్మెల్యే రేగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో రేగాను చిత్తుగా ఓడిస్తామని పొదెం సవాల్‌ చేస్తే, మోకాళ్ల యాత్ర చేసినా పొదెం తనను ఓడించలేరని కౌంటర్‌ ఇచ్చారు రేగా. రేగాను ఇంటికి పంపిస్తామని పొదెం అంటే, పొదెంను జిల్లా నుంచి తరిమికొడతామన్నారు రేగా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రాజకీయాలు.. మాటల తూటాలతో భగ్గుమంటున్నాయి. పినపాకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ఇందుకు వేదికగా మారింది. దీక్షకు ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అందుకు కౌంటర్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కూడా అయిన రేగా కాంతారావు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

వచ్చే ఎన్నికల్లో రేగా కాంతారావును భారీ మెజారిటీతో ఓడిస్తామని సవాల్ విసిరారు పొదెం. కాంతారావు ఆయన సంపాదన కోసమే పార్టీ మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇప్పించలేదని విమర్శించారు. పొదెం వీరయ్య సవాళ్లపై ఘాటుగా స్పందించారు రేగా కాంతారావు. దమ్ముంటే నువ్వు పినపాకలో పోటీ చేస్తావా లేదా భద్రాచలంలో నన్ను పోటీ చేయమంటావా అని సవాల్‌ విసిరారు. జిల్లా నుంచి పొదెంను తరిమి కొడతామని వార్నింగ్‌ ఇచ్చారు. పినపాక వేదికగా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం హాట్‌ టాపిక్‌గా మారింది. పినపాకలో రేగాను ఓడిస్తామని పొదెం అంటుంటే, అంత సీన్‌ పొదెంకు లేదంటున్నారు రేగా. ములుగు, భద్రాచలం సంగతి ఏంటో కూడా చూస్తానని, వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నారు.