Adilabad RIMS: పట్టపగలే 30 లక్షల విలువైన వెంటలేటర్లు మాయం..

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో మరోసారి భద్రతా లోపాలు, యాజమాన్య నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 30న పట్టపగలే ఆస్పత్రిలోని RICUలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రూ.30 లక్షల విలువైన వెంటిలేటర్లను అపహరించారు. సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ దుండగులు బెడ్ల పక్కనే ఉన్న పరికరాలను ఎత్తుకెళ్లడం విస్మయం కలిగిస్తోంది.

Adilabad RIMS: పట్టపగలే 30 లక్షల విలువైన వెంటలేటర్లు మాయం..
Ventilators Stolen

Updated on: Nov 04, 2026 | 9:36 PM

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యం-దొంగలు, దుండగులకు కలిసొస్తుంది. బయటి నుంచి వచ్చి దర్జాగా RICUలోని వెంటిలేటర్లను ఎత్తుకుపోయారు అగంతకులు. అక్టోబర్ 30న పట్టపగలే 30 లక్షల విలువైన వెంటలేటర్లను అపహరించారు. బయటకుపొక్కకుండా వారంరోజులు విషయాన్ని దాచిపెట్టింది రిమ్స్ యాజమాన్యం. వెంటిలేటర్లు కళ్లముందే పీక్కుపోతున్నా సిబ్బంది పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఆదిలాబాద్ రిమ్స్‌ నిర్లక్ష్యానికి సంబంధించి కనీసం నెలకు ఒక ఘటనైనా ఉండాల్సిందే అన్నట్లు ఉంది లేటెస్ట్ సీన్. సెప్టెంబర్‌లో ఏసీ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఐదుగురు పసిబిడ్డలు చనిపోయారు. ఆ తర్వాత ఓ రోగికి వైద్యం చేయకపోగా వేధించిన ఘటన అక్టోబర్‌లో వెలుగులోకి వచ్చింది. అంతకుముందు మేలో ఓ వైద్య విద్యార్థినికి లైంగిక వేధింపుల వ్యవహారం, ఇంతకుముందు అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన సీన్, ఇక ఇప్పుడు సెక్యూరిటీ లాప్స్‌, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి పట్టపగలే దోపిడీ చోటు చేసుకుంది.

సీసీ కెమెరాలు ఫ్రేమ్ టు ఫ్రేమ్ రికార్డ్ చేస్తున్నాయి. ఆ రికార్డ్ అవుతున్న దృశ్యం ఇక్కడ చోరికి వచ్చిన వాళ్లకీ తెలుసు. పైగా వాటివైపే చేస్తూ మరి వెంటిలేటర్లు ఎత్తుకెళ్లారు. అక్టోబర్ 30న మధ్యాహ్నం వేళ RICUలోకి వచ్చి బెడ్స్ పక్కనే ఉన్న వెంటిలేటర్లను పెకిలించి.. దర్జాగా ఎత్తుకెళ్లారు. పోలీసు కేసు పెట్టారు గానీ, బయట ఎవరికీ విషయం పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. వాళ్లు ఎంత జాగ్రత్తపడినా పోలీసు ఎంక్వైరీ అయితే గుట్టుగా జరగదు కదా. అలా వ్యవహారం బయటపడింది.

Loading...
Unable to load recommendations.
Follow Us