బర్త్ డే పార్టీలో చిన్న పాటి సినిమా చూపించిన రౌడీ షీటర్.. కారెక్కి తుపాకీతో గాల్లోకి కాల్పులు.. వీడియో వైరల్

నిజామాబాద్ నగర శివారులో ఓ రౌడీ షీటర్ చిన్నపాటి సినిమా చూపించాడు. బర్త్ డే పార్టీలో హల్ చల్ చేశాడు. కారు ఎక్కి పిస్టల్‌తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి హంగామా చేశాడు.

బర్త్ డే పార్టీలో చిన్న పాటి సినిమా చూపించిన రౌడీ షీటర్.. కారెక్కి తుపాకీతో గాల్లోకి కాల్పులు.. వీడియో వైరల్
Roudy Sheeter

Edited By:

Updated on: Aug 12, 2021 | 4:27 PM

Gun firing – Birthday party – Nizamabad: నిజామాబాద్ నగర శివారులో ఓ రౌడీ షీటర్ చిన్నపాటి సినిమా చూపించాడు. బర్త్ డే పార్టీలో హల్ చల్ చేశాడు. కారు ఎక్కి పిస్టల్‌తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి హంగామా సృష్టించాడు. ఫాం హౌస్ లో బర్త్ డే వేడుకల్లో స్నేహితులు వెంటరాగా బిల్డప్ ఇచ్చాడు. కాగా, సదరు యువకుడు జైలు నుంచి ఇటీవల బెయిల్ పై విడుదలైనట్టు సమాచారం.

అంతేకాదు, పుట్టినరోజు వేడుకల్లో చేసిన హంగామానంతా వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే, నిందితుడు గాల్లోకి కాల్పులు జరిపింది డమ్మీ పిస్టల్ తోనా లేదా అసలైన తుపాకీనా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంతేకాదు, షేర్ చేసిన వీడియోలో మార్పింగ్ జరిగిందా.. అనే విషయాన్ని కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. నిజమైన తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారా.. అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. హంగామా వీడియో ఇదే..

Read also: Land survey: ఆనాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలి.. డ్రోన్లు సహా ఎన్ని సాంకేతిక పరికరాలు కావాలో అన్నిటినీ వాడండి: ఏపీ సీఎం

Loading...
Unable to load recommendations.
Follow Us