Telangana: ‘ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేస్తే కానిస్టేబుల్ వేధించాడు’.. సూసైడ్ నోట్ రాసి

| Edited By: Narender Vaitla

Nov 08, 2024 | 10:27 PM

ఫిర్యాదు తీసుకోవాల్సిన పోలీసులు అతనిపై దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సాయిలు…. కిషన్ ను తీవ్రంగా కొట్టాడని కుటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. అయితే సాయిలు అనే కానిస్టేబుల్ తీరుతో మనస్థాపానికి గురైన కిషన్ సూసైడ్ నోట్ రాసి బుధవారం రాత్రి రాంపూర్ లోని ఎస్సీ...

Telangana: ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేస్తే కానిస్టేబుల్ వేధించాడు.. సూసైడ్ నోట్ రాసి
Telangana
Follow us on

మొబైల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తితో అవమానకరంగా మాట్లాడటమే కాదు..తన పై ఓ కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడని…దీంతో మనస్థాపానికి గురై సదరు వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన తలారి కిషన్ అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్ పోయిందని మంగళవారం రాత్రి అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు.

ఫిర్యాదు తీసుకోవాల్సిన పోలీసులు అతనిపై దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సాయిలు…. కిషన్ ను తీవ్రంగా కొట్టాడని కుటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. అయితే సాయిలు అనే కానిస్టేబుల్ తీరుతో మనస్థాపానికి గురైన కిషన్ సూసైడ్ నోట్ రాసి బుధవారం రాత్రి రాంపూర్ లోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అది గమనించిన గ్రామస్థులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకునేసరికి అతడి శరీరం పూర్తిగా కాలిపోయింది.

కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న కిషన్ ను వెంటనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కిషన్ మృతి చెందాడు. కుటుంబసభ్యులకు అతడి వద్ద సూసైడ్ నోట్ లభ్యమైంది. ఇందులో తనకు న్యాయం జరగలేదు. ధర్మం చచ్చిపోయింది. ఫిర్యాదు చేయడానికి వెళ్తే కానిస్టేబుల్ సాయిలు నన్ను కొట్టాడు అని రాసి ఉంది. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు జాతీయ రహదారి పై..అల్లదుర్గ్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

పోలీస్ స్టేషన్‌కి వస్తే కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకొని… అతడిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వారు గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు.. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. అతని మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..