Jagtial: వాహన తనిఖీల్లో బైక్ సీటు కింద అనుమానాస్పదంగా కవర్.. చెక్ చేయగా

|

Jul 05, 2024 | 12:11 PM

మత్తుకు అలవాటయ్యారు. సకల వ్యసనాలు ఉన్నాయి. దీంతో ఈజీ మనీ కోసం పెడ్లర్స్‌గా మారారు. కొన్నాళ్లపాటు వీరి వ్యవహారం గుట్టుగానే సాగింది. కానీ అనూహ్య రీతిలో పోలీసులకు దొరికిపోయారు.

Jagtial: వాహన తనిఖీల్లో బైక్ సీటు కింద అనుమానాస్పదంగా కవర్.. చెక్ చేయగా
Police Checking (Representative image)
Follow us on

వ్యసనాలకు బానిసయ్యారు గంజాయి తాగడం పాటు అమ్ముతూ కొంతకాలంగా గుట్టుగా యవ్వారం సాగిస్తున్నారు. తాజాగా అనూహ్య రీతిలో అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలోని రాయపట్నం గ్రామానికి చెంది 25 ఏళ్ల వెంకటేష్,  23 ఏళ్ల చందు.. గత 2 సంవత్సరాల నుంచి గంజాయికి అలవాటయ్యారు. ఆ తర్వాత ఈజీ మనీ కోసం గంజాయి అమ్మడం కూడా షురూ చేశారు. తక్కువ ధరకు గంజాయి కొని.. తమ ప్రాంతంలో ఎక్కుడ ధరకు అమ్మడం షురూ చేశారు. రాము అనే వ్యక్తి నుంచి వీరు గంజాయి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా పోలీస్ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు.

ఇటీవల పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. నిందితులు ఇద్దరూ బైక్ సీటు కింద కవర్లో గంజాయి పెట్టుకుని ధర్మపురికి వస్తున్నారు. ఈ క్రమంలో చెకింగ్ చేస్తుండగా.. సీటు కింద కవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో.. తనికీ చేయగా గంజాయి యవ్వారం బయటపడింది. నిందితులు నుంచి 40 వేల విలువైన గంజాయి, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరికి గంజాయి సప్లై చేసిన రాము అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు.

Jagtial Police

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…