ఎక్సైజ్‌కు లిక్కర్ కిక్కు.. అదిరిపోయిన అప్లికేషన్ల ఇన్‌కమ్

తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు భారీ స్పందన వస్తోంది. బుధవారంలో దరఖాస్తులకు గడువు ముగిసింది. కాగా, 2,216 మద్యం షాపులకు ఇప్పటివరకు 45 వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తులతో ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే 20 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం కన్నా అదనంగా రూ. 470 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ […]

ఎక్సైజ్‌కు లిక్కర్ కిక్కు.. అదిరిపోయిన అప్లికేషన్ల ఇన్‌కమ్
Follow us

| Edited By:

Updated on: Oct 17, 2019 | 12:42 PM

తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు భారీ స్పందన వస్తోంది. బుధవారంలో దరఖాస్తులకు గడువు ముగిసింది. కాగా, 2,216 మద్యం షాపులకు ఇప్పటివరకు 45 వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తులతో ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే 20 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం కన్నా అదనంగా రూ. 470 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ లో 261 దుకాణాలకు గాను, 2,534 దరఖాస్తులు వచ్చాయి. ఇక హైదరాబాద్‌లో 173 మద్యం దుకాణాలకు గాను 1,319 దరఖాస్తులు వచ్చాయి. ఇక, ఈ నెల 18న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను ప్రభుత్వం కేటాయించనుంది. అయితే ఏపీకి చెందిన వ్యాపారస్తులు తెలంగాణలో మద్యం షాపులను దక్కించుకోవడానికి బంధువులు, స్నేహితుల ద్వారా టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. ఏపీలో కొత్త పాలసీ ప్రకారం ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. దీంతో తెలంగాణలో తమ వ్యాపారాన్ని కొనసాగించాలని ఏపీ మద్యం వ్యాపారస్తులు ప్రయత్నిస్తున్నారు.