
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన షార్ట్ వీడియో సర్వీస్ YouTube Shorts కోసం కొత్త AI రీమిక్స్ ఫీచర్‌ను టెస్టింగ్ స్టేజ్‌లో రిలీజ్ చేసింది. ఈ ఫీచర్‌తో కంటెంట్ క్రియేటర్లు ఇప్పటికే ఉన్న వీడియోల నుంచి కొత్త షార్ట్ వీడియోలను వేగంగా రూపొందించుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్ మాట్లాడే కొంతమంది క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ అప్డేట్‌లో ప్రధాన లక్ష్యం ఎడిటింగ్‌ను సులభతరం చేయడం, ట్రెండింగ్ కంటెంట్‌ను వేగంగా సృష్టించేలా చేయడం, యాప్‌ను వదిలి బయట సాఫ్ట్‌వేర్ అవసరం లేకుండా, AI సహాయంతోనే వీడియోలను మార్చుకునే అవకాశం కల్పిస్తోంది.
కొత్త ఫీచర్లలో మొదటిది Add Object. ఈ టూల్ ద్వారా క్రియేటర్లు AI రూపొందించిన అంశాలను తమ షార్ట్ వీడియో క్లిప్‌లోకి యాడ్ చేయొచ్చు. ఇది ముఖ్యంగా 8 సెకన్ల వీడియోలపై పనిచేస్తుంది. వినియోగదారులు కేవలం ప్రాంప్ట్ టైప్ చేస్తే సరిపోతుంది. మిగతా పని AI స్వయంగా పూర్తి చేస్తుంది. దీంతో క్లిష్టమైన ఎడిటింగ్ అవసరం తగ్గిపోతుంది.
మరో కీలక టూల్ Reimagine. ఇది ఒక చిన్న వీడియోలోని ఒక్క ఫ్రేమ్‌ను తీసుకుని పూర్తిగా కొత్త AI వీడియోగా మార్చుతుంది. వినియోగదారులు ప్రాంప్ట్‌లతో పాటు రెండు రిఫరెన్స్ ఫోటోలు ఇవ్వడం ద్వారా వీడియో రూపాన్ని తమకు నచ్చినట్టు రూపొందించుకోవచ్చు. అంటే, ఒక సాధారణ క్షణాన్ని పూర్తిగా భిన్నమైన సృజనాత్మక వీడియోగా మార్చే శక్తి ఈ టూల్‌కు ఉంది.
AI రీమిక్స్‌లపై పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది. ప్రతి AI రీమిక్స్ అసలు షార్ట్ వీడియోకు లింక్ అవుతుంది, దీంతో మూల క్రియేటర్‌కు క్రెడిట్ లభిస్తుంది. తమ వీడియోలు AI రీమిక్స్‌లో ఉపయోగించకూడదనుకునే క్రియేటర్లు ఆ ఎంపికను ఆఫ్ చేసుకునే వీలుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి