
యమహా పాపులర్ స్కూటర్లయిన రేజెడ్ఆర్ మరియు ఫాసినో మోడల్స్‌లో సరికొత్త మార్పులు చేశారు. ఆధునిక టెక్నాలజీతో పాటు స్టైలిష్ లుక్‌ను కోరుకునే రైడర్ల కోసం కంపెనీ ఈ అప్‌డేట్స్‌ను అందించింది. ఈ స్కూటర్ల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) 125cc Fi హైబ్రిడ్ స్కూటర్ లైనప్‌ను 2026 కోసం అప్‌డేట్ చేసింది. ఇందులో భాగంగా RayZR 125 Fi హైబ్రిడ్, ఫాసినో 125 Fi హైబ్రిడ్ స్కూటర్లకు కొత్త కలర్ ఆప్షన్స్, రివైజ్డ్ గ్రాఫిక్స్‌తో పాటు కొన్ని కొత్త ఫీచర్లను అందుకుంది. ముఖ్యంగా RayZR స్ట్రీట్ ర్యాలీలోని ఎంపిక చేసిన వేరియంట్లకు TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు అందించారు.
2026 మోడల్ ఇయర్ కోసం యమహా రెండు స్కూటర్ సిరీస్‌ల లుక్‌ను రిఫ్రెష్ చేసింది. కొత్త పెయింట్ స్కీమ్స్, అప్‌డేటెడ్ గ్రాఫిక్స్‌ను తీసుకొచ్చింది. అయితే స్కూటర్ల ప్రాథమిక డిజైన్, మెకానికల్ ప్యాకేజీలో పెద్దగా మార్పులు చేయలేదు. RayZR 125 Fi హైబ్రిడ్ స్పోర్టీ డిజైన్‌ను కొనసాగిస్తుండగా.. ఫాసినో 125 Fi హైబ్రిడ్ తనకు ప్రత్యేకమైన రెట్రో ప్రేరిత స్టైలింగ్‌ను అలాగే కొనసాగిస్తోంది. 2026 అప్‌డేట్‌లో కొత్తగా ఎంపిక చేసిన RayZR స్ట్రీట్ ర్యాలీ వేరియంట్లలో TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను అందించారు.
ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు రైడ్‌కు సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా డిస్‌ప్లేలో చూడవచ్చు. అంతేకాకుండా “యమహా ఆన్సర్ బ్యాక్ ఫంక్షన్”ను కూడా అందించింది. రద్దీగా ఉన్న పార్కింగ్ ప్రదేశాల్లో మన స్కూటర్‌ను సులభంగా గుర్తించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
కొత్త మోడల్స్‌లో ప్రధానంగా డిజైన్, ఫీచర్లపైనే యమహా దృష్టి పెట్టింది. RayZR 125 Fi హైబ్రిడ్, ఫాసినో 125 Fi హైబ్రిడ్ రెండింటిలోనూ కంపెనీ స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) హైబ్రిడ్ సిస్టమ్ కొనసాగుతుంది. ఈ హైబ్రిడ్ సిస్టమ్ యాక్సిలరేషన్ సమయంలో అదనపు సహాయాన్ని అందిస్తుంది. అలాగే “స్టాప్ & స్టార్ట్ సిస్టం”తో కలిసి పనిచేస్తూ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రెండు స్కూటర్లలోనూ ఇప్పటికే ఉన్న 125cc పవర్‌ట్రెయిన్‌నే కొనసాగించారు.
ఇంజిన్, ట్రాన్స్‌మిషన్, ఇతర ప్రధాన మెకానికల్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి కీలక మార్పులు చేయలేదు. అంటే 2026 అప్‌డేట్‌లో ప్రధానంగా కొత్త కలర్స్, గ్రాఫిక్స్, TFT డిస్‌ప్లే, నావిగేషన్, స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను మాత్రమే జోడించారు. దీంతో ఇప్పటికే ఉన్న మెకానికల్ ప్యాకేజీని కొనసాగిస్తూనే స్కూటర్లను మరింత ఆధునికంగా మార్చే ప్రయత్నం యమహా చేసింది.