
యూజర్ల కోసం వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. అందులో భాగంగా మరో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. అదేంటంటే.. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ తరహాలో సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఇది ఉండగా.. త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. యాప్‌లో మరిన్ని థ్రిల్లింగ్ ఫీచర్లను ఉపయోగించుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది.

వాట్సప్ ప్లస్ పేరుతో ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా అదనపు ఫీచర్లను జోడించనుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. అవసరం అనుకుంటే తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫీచర్లు అన్నీ ఉచితంగా అందించనుంది. వినియోగదారులు దీని గురించి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

మెస్సేజ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ లాంటి ప్రస్తుతం ఉన్న ఉచిత ఫీచర్లన్నీ ఎప్పటిలాగే కొనసాగుతాయి. అయితే సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి అదనంగా కొన్ని ప్రీమియం ఫీచర్లు అందుతాయి. యానిమేటెడ్ ఎఫెక్ట్‌లతో కొత్త స్టిక్కర్ల ప్యాక్‌లు, 20 వరకు పిన్ చేసిన చాట్‌లు, యాప్ కోసం 18 కొత్త థీమ్ కలర్స్, కస్టమ్ యాప్ ఐకాన్లు, కాల్స్ కోసం ప్రత్యేక రింగ్ టోన్లు వంటి ఫీచర్లు ఉంటాయి.

ఇక సెట్టింగ్స్‌ను ఒకే అనేక చాట్‌లకు వర్తింపచేసే సౌకర్యం అందుబాటులో ఉంది.ఈ వాట్సప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ధర ఒక్కో దేశంలో ఒక్కొలా ఉంటుంది. యూరప్‌లో నెలకు 2.49 యూరోస్‌గా ఉంది. ఇక మెక్సికోలో 29 డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో రూ.2610గా ఉంది. బిల్లింగ్ నెలవారీగా ఉంటుంది. ఆటో రెన్యూవల్ ప్రతీ నెలా చేసుకోవచ్చు.

ఇక సబ్‌స్క్రిప్షన్ వద్దనుకుంటే ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తుండగా.. కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాంక్ ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లను జోడించవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదార్లకు మాత్రమే ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఐఓఎస్ వెర్షన్‌కు భవిష్యత్తులో తీసుకురానున్నారు.