Telugu News Technology WhatsApp Rolls Out Restricted Chat Feature to Enhance User Privacy: Check How to Enable It?
WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సేఫ్టీ ఫీచర్ వచ్చేసింది
కస్టమర్ల అభిరుచులు, భద్రతను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా యూజర్ల ప్రైవసీని మరింత పెంచేలా వాట్సాప్ సరికొత్తగా రిస్ట్రిక్టెడ్ చాట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్లో అందుబాటులో ఉండగా, త్వరలోనే సాధారణ ఆండ్రాయిడ్ యూజర్లందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
చాలామంది తమ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ లాగిన్ చేస్తుంటారు. అలాంటి సమయాల్లో ఆ సిస్టమ్‌ను ఇతరులు వాడినప్పుడు వ్యక్తిగత చాట్లు కనిపించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ, వినియోగదారుల వ్యక్తిగత, ముఖ్యమైన సంభాషణలకు పూర్తి భద్రత కల్పించేందుకు వాట్సాప్ ఈ సరికొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. అదే రిస్ట్రిక్టెడ్ చాట్.. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే, ఆ చాట్లు ఇతరులకు కనిపించవు. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత సంభాషనను ప్రైవసీగా ఉంచుతుంది.
రిస్ట్రిక్టెడ్ చాట్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం ఎలా?
మీ ఫోన్లో ఈ ఫీచర్‌ను ఆన్ చేయడం చాలా సులభం
మీరు రహస్యంగా ఉంచాలనుకుంటున్న కాంటాక్ట్ ప్రొఫైల్‌ను ఓపెన్ చేయండి.
కిందికి స్క్రోల్ చేస్తే ‘రిస్ట్రిక్టెడ్ చాట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. అవసరం లేదని భావిస్తే ఎప్పుడైనా దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు.
రిస్ట్రిక్టెడ్ చాట్ వల్ల కలిగే ప్రయోజనాలు:
లింక్డ్ డివైజ్‌లలో కనిపించవు: మీ వాట్సాప్‌ను ఇతర కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లకు లింక్ చేసినప్పటికీ, ఈ రిస్ట్రిక్టెడ్ చాట్లు వాటిలో కనిపించవు; మెసేజ్‌లు కూడా లోడ్ కావు.
మీడియా భద్రత: ఈ చాట్లలో వచ్చే ఫొటోలు, వీడియోలు మీ ఫోన్ గ్యాలరీలోకి ఆటోమేటిక్‌గా సేవ్ అవ్వవు.
ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉండదు: ఈ సంభాషణలను ఇతర రూపాల్లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుపడదు.