Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు పండగలాంటి వార్త.. అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తున్న మెసేజింగ్ యాప్‌..

|

Aug 09, 2022 | 5:10 PM

Whatsapp: ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌ను ఎన్నిసార్లు చెక్‌ చేస్తామో లెక్కే ఉండదు. మనిషికి నీరు, గాలి ఎంత ముఖ్యమో వాట్సాప్‌ కూడా అంతే ముఖ్యంగా మారిపోయింది. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న...

Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు పండగలాంటి వార్త.. అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తున్న మెసేజింగ్ యాప్‌..
Follow us on

Whatsapp: ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌ను ఎన్నిసార్లు చెక్‌ చేస్తామో లెక్కే ఉండదు. మనిషికి నీరు, గాలి ఎంత ముఖ్యమో వాట్సాప్‌ కూడా అంతే ముఖ్యంగా మారిపోయింది. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌గా పేరు తెచ్చుకున్న వాట్సాప్‌ ఆ క్రేజ్‌ ఊరికే రాలేదు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. యూజర్ల ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోన్న వాట్సాప్‌ ఆ క్రమంలో ఇంట్రెస్టింగ్ ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది.

వాట్సాప్‌లో ఎదుటి వారికి పంపిన మెసేజ్‌లను డిలీట్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ‘వాట్సాప్‌ ఫర్‌ ఎవ్రీ వన్‌’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని నిడివి ప్రస్తుతం కేవలం 60 నిమిషాలు మాత్రమే ఉంది. అంటే ఎదుటి వారికి పంపిన మెసేజ్‌ను 60 నిమిషాల్లో డిలీట్‌ చేస్తేనే డిలీట్‌ అయ్యే ఫీచర్‌ అందుబాటులో ఉంది. అయితే వాట్సాప్‌ ప్రస్తుతం ఈ గడువును ఏకంగా 2 రోజులకు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాట్సాప్‌ ఈ సమయాన్ని రెండు రోజుల 12 గంటలకు పెంచనుంది. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..