ఈ తప్పులు చేస్తే మీ వాట్సప్ అకౌంట్ శాశ్వతంగా బ్లాక్.. అస్సలు చేయకూడని పనులివే..

పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకు వాట్సప్ ఎక్కువగా వాడుతుంటాం. స్నేహితులు, కుటుంబసభ్యులు ,బంధువులతో కనెక్ట్ కావడంతో పాటు వ్యాపార, ఉద్యోగ అవసరాల కోసం వాట్సప్ వినియోగిస్తుంటారు. అయితే ఈ తప్పులు చేయడం వల్ల వాట్సప్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఈ తప్పులు చేస్తే మీ వాట్సప్ అకౌంట్ శాశ్వతంగా బ్లాక్.. అస్సలు చేయకూడని పనులివే..
Whatsapp

Updated on: Oct 01, 2026 | 10:16 PM

స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరి ఫోన్లలో తప్పనిసరిగా వాట్సప్ అనేది ఉంటుంది. విద్య, వ్యాపారం, ఉద్యోగ అవసరాల కోసం ఈ ఫ్లాట్‌ఫామ్ ఉపయోగించడం తప్పనిసరి అయింది. ఇక స్నేహితులు, బంధువులతో ఛాటింగ్, వీడియో, ఆడియో కాల్స్, ఫొటోలు పంపించుకోవడానికి వాట్సప్ బాగా ఉపయోగపడుతుంది. అయితే వాట్సప్ ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు శాశ్వతంగా బ్లాక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకేసారి వేర్వేరు నెంబర్ల నుంచి పెద్ద సంఖ్యలో మెస్సేజ్‌లు రావడం, ఒకే రకమైన మెస్సేజ్‌లు రావడం, బల్క్ ఫార్వార్డింగ్/కాపీ-పేస్ట్ వంటి వాటి వల్ల వాట్సప్ బ్లాక్ అవ్వొ్చ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి వైరల్ కంటెంట్‌లో నేరుగా వాట్సప్ నంబర్‌లను పొందుపరచడం వలన రీల్ వైరల్ అయినప్పుడు వేల సంఖ్యలో సందేశాలు ఒకేసారి వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ అయ్యే అవకాశముంటుంది. ఒకే రకమైన వందల, వేల సందేశాలు రావడం వల్ల వాట్సప్ స్పామ్ లేదా అనుమానాస్పద చర్యగా భావిస్తుంచి మీ అకౌంట్ బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకే సందేశాన్ని, ఫోటోను లేదా వీడియోను చాలా మందికి బల్క్‌గా ఫార్వార్డ్ చేయడం లేదా కాపీ-పేస్ట్ చేయడం వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఆటోమేటెడ్ గ్రీటింగ్ మెసేజ్‌లు లేదా రిప్లైలు అందరికీ ఒకే విధంగా వెళ్లడం వల్ల బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

-మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో నేరుగా వాట్సప్ నంబర్‌ను ఇవ్వడం మానుకోండి. నంబర్‌ను రీల్ క్యాప్షన్‌లో లేదా బయోలో ఇవ్వండి. క్యాప్షన్లు అవసరమైతే సవరించవచ్చు

– మీ వాట్సప్ బిజినెస్ ఖాతా కేటలాగ్‌ను అన్ని ఉత్పత్తులు, వివరాలతో పూర్తిగా పూరించండి. ఇది మీ వ్యాపారానికి విశ్వసనీయతను ఇస్తుంది

-మీ వాట్సప్ బిజినెస్ ఖాతా నుండి రోజువారీగా కనీసం ఒక స్టేటస్ అప్‌డేట్ చేయండి. ఇది మీ ఖాతా సక్రియంగా, వ్యక్తిగతంగా ఉపయోగించబడుతున్నట్లు వాట్సప్‌కు తెలియజేస్తుంది

– కొత్త వాట్సప్ బిజినెస్ ఖాతాను ప్రారంభించినప్పుడు మొదటి 15-20 రోజులు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సాధారణ సంభాషణల కోసం ఉపయోగించండి. ఇది ఖాతామెయిన్ అకౌంట్ స్థితిని పెంచుతుంది

– మీ కస్టమర్ ట్రాఫిక్‌ను నేరుగా వాట్సప్‌‌కు మళ్లించవద్దు. నిజమైన ఆసక్తి ఉన్నవారిని మాత్రమే వాట్సప్‌కు దారి మళ్ళించండి. ఇది అనవసరమైన విచారణలను ఫిల్టర్ చేసి మీ వాట్సప్‌కు వచ్చే సందేశాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది

-భారీ సంఖ్యలో సందేశాలను నిర్వహించాల్సి వస్తే, ఆటోమేటెడ్ రిప్లైలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఒకే రకమైన సమాధానాలను అందరికీ కాపీ-పేస్ట్ చేయడం మానుకోండి.సందేశాలలో వైవిధ్యాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us