లిక్విడ్‌ డిటర్జెంట్‌ వర్సెస్‌ సర్ఫ్‌ పౌడర్‌.. బట్టలు మెరవాలంటే వాషింగ్‌ మెషీన్‌లో ఏది వాడాలి?

వాషింగ్ మెషీన్‌లో లిక్విడ్ డిటర్జెంట్ వాడాలా లేక పౌడర్ డిటర్జెంట్ వాడాలా అనేది చాలామంది సందేహం. తేలికపాటి మరకలకు, ఫ్రంట్ లోడ్ మెషీన్లకు లిక్విడ్ మంచిది. ఇది త్వరగా కరిగి అవశేషాలు వదలదు. మట్టి, చెమట మరకలకు పౌడర్ డిటర్జెంట్ సమర్థవంతమైనది.

లిక్విడ్‌ డిటర్జెంట్‌ వర్సెస్‌ సర్ఫ్‌ పౌడర్‌.. బట్టలు మెరవాలంటే వాషింగ్‌ మెషీన్‌లో ఏది వాడాలి?
Liquid Vs Powder Detergent

Updated on: Mar 09, 2026 | 6:42 AM

ఇంటి పనులను సులభతరం చేసిన ముఖ్యమైన ఉపకరణాల్లో వాషింగ్‌ మెషీన్‌ ఒకటి. అయితే బట్టలు బాగా శుభ్రం కావాలంటే లిక్విడ్‌ డిటర్జెంట్‌ వాడాలా? లేక డిటర్జెంట్‌ పౌడర్‌ వాడాలా? అనే డౌట్‌ మహిళల్లో ఉంటుంది. అయితే రెండింటికీ ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఉపయోగించే విధానం, బట్టల రకం ఆధారంగా ఫలితం మారుతుంది. లిక్విడ్‌ డిటర్జెంట్‌ ప్రధానంగా తేలికపాటి మరకలు ఉన్న బట్టలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది నీటిలో త్వరగా కరిగిపోతుంది కాబట్టి బట్టలపై అవశేషాలు మిగిలే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్లలో లిక్విడ్‌ డిటర్జెంట్‌ వాడితే బట్టలు మృదువుగా, శుభ్రంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చల్లని నీటిలో కూడా ఇది సులభంగా కలిసిపోతుంది.

మరోవైపు డిటర్జెంట్‌ పౌడర్‌ మాత్రం మట్టి, చెమట మరకలు ఎక్కువగా ఉన్న బట్టలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. రోజూ బయట పని చేసే వారి బట్టలు లేదా పిల్లల యూనిఫామ్‌లకు పౌడర్‌ డిటర్జెంట్‌ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో పౌడర్‌ పూర్తిగా కరగకపోతే బట్టలపై తెల్లటి మచ్చలు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే సరైన మోతాదులో వాడటం అవసరం. ఫ్రంట్‌ లోడ్‌ మెషీన్లలో సాధారణంగా లిక్విడ్‌ డిటర్జెంట్‌ మంచిదిగా భావిస్తారు. టాప్‌ లోడ్‌ మెషీన్లలో మాత్రం పౌడర్‌ లేదా లిక్విడ్‌ రెండింటినీ ఉపయోగించవచ్చు.

అలాగే మెషీన్‌ సామర్థ్యం, బట్టల పరిమాణం, మరకల తీవ్రతను బట్టి డిటర్జెంట్‌ను ఎంపిక చేయడం మంచిదని సూచిస్తున్నారు. మొత్తానికి బట్టలు బాగా శుభ్రం కావాలంటే కేవలం డిటర్జెంట్‌ రకం మాత్రమే కాకుండా సరైన మోతాదు, సరైన వాషింగ్‌ మోడ్‌, నీటి ఉష్ణోగ్రత కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి అవసరానికి అనుగుణంగా లిక్విడ్‌ లేదా పౌడర్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా వాషింగ్‌ మెషీన్‌లో బట్టలను మరింత శుభ్రంగా ఉతుక్కోవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us