Vivo X90 Series: వివో ఎక్స్‌90 సిరీస్‌ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. ఆకట్టుకునే ఫీచర్స్‌

|

Nov 15, 2022 | 8:58 AM

మార్కెట్లో రోజురోజుకు కొత్త స్మార్ట్‌ ఫోన్లు విడుదలవుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా మొబైల్‌ తయారీ కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను..

Vivo X90 Series: వివో ఎక్స్‌90 సిరీస్‌ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. ఆకట్టుకునే ఫీచర్స్‌
Vivo X90 Series
Follow us on

మార్కెట్లో రోజురోజుకు కొత్త స్మార్ట్‌ ఫోన్లు విడుదలవుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా మొబైల్‌ తయారీ కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక వివో నుంచి త్వరలో మరి కొత్త ఫోన్‌ విడుదల కానుంది. ఎక్స్‌90 సిరీస్ మొబైల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వివో ఎక్స్‌80 సిరీస్‌కు కొన‌సాగింపుగా వివో ఎక్స్‌90 క‌స్టమ‌ర్ల ముందుకు రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ న‌వంబ‌ర్ 22న చైనాలో విడుదల కానుంది. ఈ తర్వాత భారత్‌లో విడుదల కానుంది. వివో ఎక్స్90 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్90, వివో ఎక్స్‌90ప్రొ, వివో ఎక్స్‌90ప్రొ+ క‌స్టమ‌ర్ల ముందుకు రానున్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ బ్రైట్ రెడ్ క‌ల‌ర్‌తో పాటు బ్లాక్ క‌ల‌ర్‌లో రియ‌ర్ సైడ్ భారీ స‌ర్క్యుల‌ర్ కెమెరా మాడ్యూల్‌తో వివో ఎక్స్‌90 క‌స్టమ‌ర్లకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌989 1 ఇంచ్ ప్రైమ‌రీ కెమెరా సెన్సర్‌తో పాటు 48ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపీ పోర్ట్రయిట్ టెలిఫొటో కెమెరా, 64ఎంపీ ఒమ్నివిజ‌న్ ఓవీ64బి పెరిస్కోప్ కెమెరాను క‌లిగిఉంటుందని తెలుస్తోంది.

క్యూహెచ్‌డీ+ రిజ‌ల్యూష‌న్‌తో 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లే, క్వాల్‌కాం ఫ్లాగ్‌షిప్ ప్రాసెస‌ర్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్ వంటి ఫీచ‌ర్లతో మార్కెట్లోకి రానుంది. వివో ఎక్స్‌90 అండ్రాయిడ్ 13 అవుటాఫ్‌దిబాక్స్ ఓఎస్‌తో ఫ‌న్ ట‌చ్ ఓఎస్ 13 అవుటాఫ్‌ది బాక్స్ ఓఎస్‌పై ర‌న్ అవుతుంది. ఇక వివో ఎక్స్‌90 100w ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం క‌లిగి ఉంటుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి