Youtube: కీల‌క నిర్ణ‌యం తీసుకున్న యూట్యూబ్‌.. న‌ష్ట‌మ‌ని తెలిసినా.. ఇక‌పై ఆ యాడ్స్‌కు అడ్డుక‌ట్ట‌..

|

Jun 18, 2021 | 6:18 AM

Youtube: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి యూట్యూబ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉప‌యోగించే వీడియో ప్లాట్ ఫామ్‌ల‌లో యూట్యూబ్ మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. కేవ‌లం యూజ‌ర్‌కు...

Youtube: కీల‌క నిర్ణ‌యం తీసుకున్న యూట్యూబ్‌.. న‌ష్ట‌మ‌ని తెలిసినా.. ఇక‌పై ఆ యాడ్స్‌కు అడ్డుక‌ట్ట‌..
Youtube
Follow us on

Youtube: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి యూట్యూబ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉప‌యోగించే వీడియో ప్లాట్ ఫామ్‌ల‌లో యూట్యూబ్ మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. కేవ‌లం యూజ‌ర్‌కు వీడియో కంటెంట్ అందించ‌డ‌మే కాకుండా ఔత్సాహికులకు త‌మ‌లోని ట్యాలెంట్‌ను బ‌య‌ట‌పెట్టుకునేందుకు యూట్యూబ్ మంచి వేదిక‌గా ఉప‌యోగప‌డుతుంది. యూట్యూబ్‌తో ఎంతో మంది డ‌బ్బులు కూడా సంపాదిస్తున్నారు.
ఇక యూట్యూబ్ ఓపెన్ చేయ‌గానే హోమ్ పేజీపై క‌నిపించే ప్ర‌క‌ట‌న‌ల గురించి మ‌నంద‌రికీ తెలుసు. ఈ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా గూగుల్‌కు భారీ ఎత్తున ఆదాయం వ‌స్తుంది. ఈ యాడ్స్‌కు సంబంధించి యూట్యూబ్ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై యూట్యూబ్ హోం పేజీలో గ్యాంబ్లింగ్‌, ఆల్కాహాల్‌, పాలిటిక్స్‌, డ్రగ్స్‌కు లింకు ఉన్నయాడ్స్ కనిపించవని యూట్యూబ్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇకపై ఈ స్థానంలో యూజర్లకు పనికొచ్చేవి, అవగాహనకు సంబంధించిన యాడ్‌లే ఉండాలని యూట్యూబ్‌ నిర్ణయించింది. యూజర్ల పట్ల మరింత బాధ్యతగా వ్య‌వ‌హారించాల‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. యూజ‌ర్ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే యాడ్స్‌కు యూట్యూబ్‌లో స్థానం ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. ఇక యూట్యూబ్ వీడియోల్లో కీల‌క‌మైన థంబ్ నెయిల్స్ విష‌యంలో కూడా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని యూట్యూబ్ తెలిపింది.

Also Read: Viral Video: గూగుల్ డూడుల్ పోటీలో విజేతకు షాక్.. వీడియో కాల్ చేసిన సుందర్ పిచాయ్

Smart Phone: స్మార్ట్ ఫోన్ కెమేరాతో చెడు బాక్టీరియాను గుర్తించవచ్చట.. అమెరికా సైంటిస్ట్స్ అద్భుత ఆవిష్కరణ!

Lay Off 30 Lakh IT Employees: ఐటీ రంగంలో నైపుణ్యం లేకుంటే అంతే.. 2022 నాటికి దేశంలో 30 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు గల్లంతు!