Smartwatches under 3000: ట్రెండీ లుక్.. కిల్లింగ్ ఫీచర్స్‪.. ఈ స్మార్ట్ వాచ్‪ల ధర కేవలం రూ. 3000లోపే..

| Edited By: Anil kumar poka

Mar 29, 2023 | 5:00 PM

ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ వాచ్ లలో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి. బీపీ, పల్స్ రేట్ మోనిటర్, కేలరీ బర్న్ మోనిటర్, జీపీఎస్ సెన్సార్, శక్తివంతమైన బ్యాటరీ, బ్లూటూత్ కనెక్టవిటీతో వస్తున్నాయి. మరీ వీటిల్లో ఏ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనే ప్రశ్న అందరికీ వచ్చే ఉంటుంది.

Smartwatches under 3000: ట్రెండీ లుక్.. కిల్లింగ్ ఫీచర్స్‪.. ఈ స్మార్ట్ వాచ్‪ల ధర కేవలం రూ. 3000లోపే..
Smart Watch
Follow us on

చిన్నా పెద్దా తేడా లేదు.. అందరికీ ట్రెండీ ఐటెం స్మార్ట్ వాచ్. అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ వాచ్ అందరి చేతులకు దర్శనమిస్తున్నాయి. అయితే గ్యాడ్జెట్ ధరలు రూ. లక్షలోనూ ఉంటాయి. అలాగే రూ. 1000 లోనూ ఉంటాయి. వాటిల్లో మనకు అవసరమైన ఫీచర్లు, బ్రాండ్ వ్యాల్యూని బట్టి ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ వాచ్ లలో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి. బీపీ, పల్స్ రేట్ మోనిటర్, కేలరీ బర్న్ మోనిటర్, జీపీఎస్ సెన్సార్, శక్తివంతమైన బ్యాటరీ, బ్లూటూత్ కనెక్టవిటీతో వస్తున్నాయి. మరీ వీటిల్లో ఏ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనే ప్రశ్న అందరికీ వచ్చే ఉంటుంది. అందుకే మీకు అనుకూలనమైన బడ్జెట్ లో అంటే కేవలం మూడు వేల రూపాయలలోపు బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ వాచ్ ల జాబితాను మీకు అందిస్తున్నాం. మీరూ ఓ లుక్కేయండి..

రెడ్‌మి వాచ్ 2 లైట్.. బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ల విషయానికి వస్తే, రెడ్‌మి వాచ్ 2 లైట్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ కాంపాక్ట్ స్మార్ట్‌వాచ్ విభిన్న రంగు ఎంపికలలో వస్తుంది, 2.5డీ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 1.55-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌లో హృదయ స్పందన సెన్సార్, SpO2 సెన్సార్ ఉంటుంది. నిద్రను ట్రాక్ చేయకలుగుతుది. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ ఉంది. 100 రకాల వ్యాయామ ట్రాకింగ్‌లకు మద్దతు ఇస్తుంది. దీని ధర రూ. 2,499గా ఉంది.

అమాజ్‌ఫిట్ బిప్ 3.. ఈ వాచ్ పెద్ద 1.69-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఆపిల్ వాచ్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. పూర్తి వాటర్ ప్రూఫ్ బాడీ ఉంటుంది. క్రికెట్‌తో సహా 60 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. దీనికి జీపీఎస్ ట్రాకింగ్ లేనప్పటికీ, ఇది నమ్మకమైన హృదయ స్పందన సెన్సార్‌ను అందిస్తుంది నిద్రను ట్రాక్ చేయగలదు. దీని ధర రూ. 1,999గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బోట్ ఎక్స్‌టెండ్.. ఈ స్మార్ట్ వాచ్ కి అమెజాన్ లో 70,000 రివ్యూలు, 4.2 స్టార్ రేటింగ్ ఉంది. ప్రస్తుతం అమెజాన్ లో అమ్ముడవుతున్న బడ్జెట్ స్మార్ట్ వాచ్ ఇదే. ఇది 1.69-అంగుళాల టచ్ డిస్‌ప్లే రొటేటబుల్ క్రౌన్‌తో ఉంటుంది. ఇది ప్రీమియం ఆపిల్ వాచ్‌లో మాదిరిగానే ఉంటుంది. దీనికి జీపీఎస్ ట్రాకింగ్ లేనప్పటికీ, ఇది హృదయ స్పందన సెన్సార్, SpO2 సెన్సార్‌ను అందిస్తుంది. అంతర్నిర్మిత అమెజాన్ అలెక్సా ను కలిగి ఉంది. దీనిని ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్ లతో అనుసంధానించి వాడవచ్చు. దీని ధర రూ. 1,799గా ఉంది.

రియల్ మీ స్మార్ట్ వాచ్ 2 ప్రో.. ఈ స్మార్ట్ వాచ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఇది హెచ్ డీ రిజల్యూషన్‌తో కూడిన 1.75-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. జీపీఎస్ ట్రాకింగ్‌ ఫీచర్ ఉంది. ఒక ఫుల్ చార్జ్ పై దీనిలోని బ్యాటరీ తొమ్మిది రోజుల పాటు వినియోగించుకునే వీలుంటుంది. దీని ధర రూ. 2984గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..