Samsung Galaxy: అదిరిపోయే ఫీచర్లతో కొత్త డివైజ్‌లను విడుదల చేయనున్న సామ్‌సంగ్‌.. ఆకట్టుకుంటోన్న టీజర్స్‌.

|

Jul 13, 2021 | 8:21 AM

Samsung Galaxy: ఎలక్ట్రానిక్‌ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది సామ్‌సంగ్‌ కంపెనీ. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రాకిన్‌ వస్తువుల రంగంలో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు...

Samsung Galaxy: అదిరిపోయే ఫీచర్లతో కొత్త డివైజ్‌లను విడుదల చేయనున్న సామ్‌సంగ్‌.. ఆకట్టుకుంటోన్న టీజర్స్‌.
Samsung Devices
Follow us on

Samsung Galaxy: ఎలక్ట్రానిక్‌ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది సామ్‌సంగ్‌ కంపెనీ. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రాకిన్‌ వస్తువుల రంగంలో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా గ్యాడ్జెట్లు తీసుకొస్తుంది కాబట్టే ఈ బ్రాండ్‌కు అంత వ్యాల్యూ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సామ్‌సంగ్‌ పలు రకాల డివైజ్‌లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన టీజర్లు ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారాయి. ఎవన్‌ బ్లస్‌ ట్వీట్‌ చేసిన ఈ టీజర్లు టెక్‌ మార్కెట్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ కొత్త ప్రొడక్ట్స్‌కు సంబంధించి సామ్‌సంగ్‌ ఆగస్టు 11న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ సామ్‌సంగ్ తీసుకురానున్న ఆ కొత్త ప్రొడక్ట్స్‌ ఏంటంటే..

ఫోల్డబుల్‌ ఫోన్‌ల మార్కెట్‌ను అందిపుచ్చుకునే క్రమంలో సామ్‌సంగ్‌ రెండు ఫోల్డబుల్‌ ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. వీటిలో ఒకటి గ్యాలక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3. ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ తెలుపు, గ్రీన్‌, బ్లాక్‌ రంగుల్లో రానుంది. ఇక జెడ్‌ ఫ్లిప్‌ 3 పేరుతో రానున్న మరో ఫోల్డబుల్‌ ఫోన్‌ను పర్పుల్‌, బ్లాక్‌, గోల్డ్‌, గ్రీన్‌ రంగుల్లో తీసుకురానున్నట్లు ఎవన్‌ బ్లస్‌ ఐడీలో చేసిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది. ఇక సామ్‌సంగ్‌ తీసుకురానున్న మరో ఫోన్‌ గ్యాలక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ. ఈ ఫోన్‌ను పర్పుల్‌, బ్లాక్‌ రంగుల్లో తీసుకురానున్నట్లు సమాచారం. అలాగే సామ్‌సంగ్ కొత్తగా స్మార్ట్‌ వాచ్‌ను కూడా పరిచయం చేయనుంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ వాచ్‌ 4 క్లాసిక్‌ పేరుతో తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోన్న ఈ వాచ్‌ గూగుల్‌తో కలిసి రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు గ్యాలక్సీ వాచ్‌ యాక్టివ్‌ 4 పేరుతో కూడా మరో వాచ్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అంతేకాకుండా సామ్‌సంగ్‌ గ్యాలక్సీ బడ్స్‌2 పేరుతో ఇయర్‌ డబ్స్‌ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ట్వీట్‌లో తెలిపింది. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

నెట్టింట వైరల్‌గా మారిన టీజర్స్‌ ఇవే..

Also Read: Viral Video: ఇలాంటి ఆక్టోపస్‌ని మీరెప్పుడూ చూసి ఉండరు..! వైరలవుతోన్న వీడియో

చిననాటి కోరిక పెద్దయ్యాక నెరవేరింది.. మీ కలలను కూడా నిజం చేస్తామంటోన్న రిచర్డ్ బ్రాన్సన్! అంతరిక్షయాత్రలో భాగమైన తెలుగమ్మాయి బండ్ల శిరీష

WhatsApp New Feature: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన వాట్సాప్‌.. ఇకపై నోటిఫకేషన్‌లో మొత్తం మెసేజ్‌ చూసేయొచ్చు.