Smartphone Settings: మీ స్మార్ట్‌ఫోన్‌ స్లో అవుతుందా..? ఈ సెట్టింగ్స్‌ మార్చితే వేగవంతం అవుతుంది..!

Smartphone Settings: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ లేనిది ఉండటం లేదు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లోనే మునిగి తేలుతుంటారు..

Smartphone Settings: మీ స్మార్ట్‌ఫోన్‌ స్లో అవుతుందా..? ఈ సెట్టింగ్స్‌ మార్చితే వేగవంతం అవుతుంది..!
Smartphone

Updated on: Sep 22, 2021 | 9:59 PM

Smartphone Settings: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ లేనిది ఉండటం లేదు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లోనే మునిగి తేలుతుంటారు. స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో పాటు ఫోన్ యూజర్లలో చాలామంది తమ ఫోన్ స్లోగా ఉందని, హ్యాంగ్ అవుతోందని చెబుతుంటారు. ఫోన్‌లలో అడ్డగోలుగా ఫోటోలు, వీడియోలు లోడ్‌ చేస్తుండటం వల్ల కూడా వేగం తగ్గిపోతుంది. అంతేకాదు రకరకాల యాప్స్‌ వేసుకోవడం వల్ల స్టోరేజీ నిండిపోయి ఫోన్‌ నెమ్మదిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను వేగంగా, స్మూత్‌గా మార్చడం మీ చేతిలోనే ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్ మారిస్తే మీ ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అయితే చాలామందికి ఆ సెట్టింగ్స్ గురించి తెలియక తమ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదని ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లో మూడు టిప్స్ పాటిస్తే చాలంటున్నారు టెక్‌ నిపుణులు. మామూలుగా స్మార్ట్‌ఫోన్ ఎక్కువకాలం ఉపయోగిస్తే ఈ సమస్య వస్తూ ఉంటుంది.

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో About ఓపెన్ చేసి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిందో లేదో చూడండి. లేకపోతే మీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయండి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడానికి 15 నిమిషాలు పట్టవచ్చు. ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి manage apps and device పైన క్లిక్ చేయండి. అందులో యాప్స్ ఏవైనా అప్‌డేట్ చేయాల్సి ఉందేమో చూడండి. అన్ని యాప్స్ అప్‌డేట్ చేయండి.

మీ స్మార్ట్‌ఫోన్‌లో యానిమేషన్స్ ఉంటే స్లోగా ఆపరేట్ అవుతుంది. పాత స్మార్ట్‌ఫోన్స్‌లో యానిమేషన్స్ సరిగ్గా పనిచేయవు. అందుకే సెట్టింగ్స్ ఓపెన్ చేసి About పైన క్లిక్ చేయండి. Build number పైన ఏడు సార్లు ట్యాప్ చేయండి. డెవలపర్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత సెట్టింగ్స్‌లో, సిస్టమ్స్‌లో డెవలపర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. కిందకు స్క్రోల్ చేస్తే యానిమేషన్స్ కనిపిస్తాయి. యానిమేషన్స్ మొత్తం ఆఫ్ చేయండి.

ఇక మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ పైన క్లిక్ చేయండి. Manage Storage పైన క్లిక్ చేయండి. అవసరం లేని ఫైల్స్, యాప్స్ డిలిట్ చేయండి. ముఖ్యమైన ఫైల్స్ ఎక్కువగా ఉంటే మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లోకి బ్యాకప్ చేసుకోండి. లేదా మెమొరీ కార్డులో ట్రాన్స్‌ఫర్ చేయండి.

పైన చెప్పిన మూడు టిప్స్ పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ పెర్ఫామెన్స్ వేగంగా, స్మూత్‌గా మారుతుంది. చిన్నపాటి టిప్స్‌తో స్మార్ట్‌ఫోన్‌ను వేగవంతం అయ్యేలా చేసుకోవచ్చు. ఈ టిప్స్‌తో కూడా మీ స్మార్ట్‌ఫోన్ ఎలాంటి మార్పులు రాకపోతే ఫైల్స్ అన్నీ బ్యాకప్ చేసి స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత అవసరమైన యాప్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలి.

ఇవీ కూడా చదవండి:

IRCTC Ticketing Portal: ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో బగ్‌ను కనుగొన్న 17 ఏళ్ల విద్యార్థి..!

Google: మీరు గూగుల్‌లో వీటి కోసం వెతుకుతున్నారా..? ఇక మోసపోవాల్సిందే.. తస్మాత్‌ జాగ్రత్త..!

Whatsapp: మీ మొబైల్‌లో సేవ్‌కాని నంబర్లకు వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలా.. ఇలా చేయండి..!

Loading...
Unable to load recommendations.
Follow Us