UPI Transactions: యూపీఐ యాప్‌లో వేరేవారికి తప్పుగా డబ్బులు పంపారా..? ఈ ఒక్క హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..

తప్పుగా యూపీఐ యాప్‌లో వేరేవారికి డబ్బులు పంపారా..? డబ్బులు అందుకున్న వ్యక్తిని అడిగితే ఇవ్వడం లేదా..? అయితే నో టెన్షన్. మీరు యూపీఐ యాప్స్ సిబ్బంది లేదా ఎన్‌పీసీఐకు ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బులు తిరిగి పొందే ఛాన్స్ ఉంది. ఏం చేయాలో చూద్దాం

UPI Transactions: యూపీఐ యాప్‌లో వేరేవారికి తప్పుగా డబ్బులు పంపారా..? ఈ ఒక్క హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
Upi Tranactions

Updated on: Feb 04, 2026 | 1:32 PM

ఇటీవల ప్రతీఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉండటంతో యూపీఐ యాప్స్ వాడకం పెరిగిపోయింది. సింపుల్‌గా సెకన్ల వ్యవధిలోనే వేరేవారికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా డబ్బులు అందుకోవడం, స్కానర్ ఉపయోగించి సెకన్లలోనే బిల్ పే చేయడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం లాంటి అనేక సౌకర్యాలు ఉండటంతో యూపీఐ పేమెంట్స్‌కు అందరూ అలవాటు పడుతున్నారు. అలాగే నేరుగా క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే అవకాశం కూడా ప్రవేశపెట్టడం కూడా మరింత మందికి ప్రయోజనం చేకూరుస్తోంది. కేంద్ర గణాంకాల ప్రకారం యూపీఐ లావాదేవీలు ప్రతీ ఏడాది రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. మెట్రో నగరాల్లోనే కాకుండా పట్టణాలు, గ్రామాల్లో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నాయి. అయితే యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్ వాడేటప్పుడు కొంతమంది పొరపాటున వేరేవారికి డబ్బులు పంపుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? అనే విషయాలు చూద్దాం.

వెంటనే ఈ పనులు చేయండి

-మీరు ఎవరికైతే పొరపాటుగా డబ్బులు సెండ్ చేశారో అతడికి కాల్ చేసి తిరిగి ఇవ్వమని అడగండి
-రిసీవర్ తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తే యూపీఐ యాప్‌లో మీరు ట్రాన్సాక్షన్ చేసిన చోట కస్టమర్ సపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. లేదా రిపోర్ట్ ఇష్యూ, యావింగ్ ఇష్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఫిర్యాదు చేయండి
-ట్రాన్సక్షన్ ఐడీ, రిసీవర్ మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ వివరాలను కస్టమర్ కేర్‌తో పంచుకోండి
-కస్టమర్ కేర్ సిబ్బంది డబ్బులు తిరిగి పొందటంలో సహాయం చేస్తారు
-యూపీఐ యాప్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా డబ్బులు వెనక్కి రాకపోతే ఎన్‌పీసీఐకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

NPCIకి ఫిర్యాదు చేయడం ఎలా..?

-నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి

-కంప్లైంట్ ఫారంపై క్లిక్ చేయండి

-యూపీఐ ఐడీ, బ్యాంక్ పేరు, అమౌంట్, డేట్, ట్రాన్సాక్షన్ ఐటీ, ట్రాన్సక్షన్ స్క్రీన్ షాట్ వివరాలు అందించి కంప్లైంట్ ఫైల్ చేయండి

-ఇక upihelp@npci.org.inకి మెయిల్ కూడా చేసి ఫిర్యాదు చేయవచ్చు

-1800-120-1740 హెల్‌లైన్ నెంబర్‌ ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు

-ఇక NPCI కూడా స్పందించకపోతే ఆర్బీఐ కూడా ఫిర్యాదు చేయవచ్చు

బ్యాంక్‌కు ఫిర్యాదు చేయండి

ఇక మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే డబ్బులు పంపించారో.. ఆ బ్యాంక్ సిబ్బందిని సంప్రదించండి. దీంతో బ్యాంక్ సిబ్బంది డబ్బులు తిరిగి పొందటంతో మీరు సహాయం అందిస్తారు. అప్పటికీ మీ డబ్బులు వెనక్కి రాకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసి రాబట్టుకోవచ్చు.