
Samsung Galaxy S24 FE ఇప్పుడు గణనీయంగా తగ్గింపు ధరకు లభిస్తోంది. లాంచ్ ధర కంటే రూ.20,000 చౌకగా అందుబాటులోకి వచ్చింది. వాలెంటైన్స్ డే సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. అలాగే అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌లు కూడా ఉన్నాయి. గత సంవత్సరం దీపావళి సందర్భంగా శామ్సంగ్ గెలాక్సీ S24 FE ని విడుదల చేసింది. ఈ ఫోన్ శక్తివంతమైన కెమెరా సెటప్, దీర్ఘకాలం ఉండే బ్యాటరీ కలిగి ఉంది.
Samsung Galaxy S24 FEని రూ.59,999 ప్రారంభ ధరకు పరిచయం చేసింది. Flipkart వాలెంటైన్స్ డే సేల్ సమయంలో ఈ ఫోన్ రూ.20,000 ప్రత్యక్ష ధర తగ్గింపుతో రూ.39,999 ప్రారంభ ధరకు లభిస్తుంది. కొనుగోలుదారులు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. దీంతో మరో రూ. 2,000 వరకు ధర తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్. Galaxy S24 FE 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన పెద్ద 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Exynos 2400e 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది, 25W వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. Galaxy S24 FE ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 10MP ఫ్రంట్ కెమెరా ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి