రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్ లాంచ్‌! లాంచ్‌కు కారణం ఏంటో తెలుసా

Royal Enfield Classic 350 Gorkha Edition.. గూర్ఖా రెజిమెంట్ వారసత్వం, స్ఫూర్తికి నివాళిగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టెక్ మరియు ఆటోమొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ప్రత్యేక ఎడిషన్ బైక్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్ లాంచ్‌! లాంచ్‌కు కారణం ఏంటో తెలుసా
Royal Enfield Classic 350 Gorkha Edition

Updated on: Aug 22, 2026 | 8:00 AM

చారిత్రాత్మక గూర్ఖా రెజిమెంట్ గుర్తింపును ప్రతిబింబించేలా రాయల్ ఎన్‌ఫీల్డ్ అద్భుతమైన బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్, ఆకట్టుకునే డిజైన్ ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త మోడల్ విశేషాలను తెలుసుకుందాం.

ఇంజిన్ విశేషాలు

క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్‌కు ప్రత్యేకమైన గూర్ఖా గ్రీన్ పెయింట్ స్కీమ్‌ను అందించారు. గూర్ఖా రెజిమెంట్‌కు గుర్తింపుగా నిలిచే క్రాస్‌డ్ ఖుక్రి గుర్తుతో ప్రత్యేక ఇన్‌సిగ్నియాను కూడా పొందుపరిచారు. స్టాండర్డ్ క్లాసిక్ 350లోని రెట్రో డిజైన్‌ను కొనసాగిస్తూనే, గూర్ఖా రెజిమెంట్ చరిత్ర, గుర్తింపును ప్రతిబింబించేలా కొన్ని ప్రత్యేక అంశాలను జోడించారు. టియర్‌డ్రాప్ ఆకారంలోని ఫ్యూయల్ ట్యాంక్, కర్వ్డ్ బాడీ ప్యానెల్స్, డీప్ ఫెండర్స్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, ఫిన్డ్ ఇంజిన్ కేసింగ్స్ వంటి క్లాసిక్ 350లోని ప్రధాన డిజైన్ అంశాలు ఇందులో కొనసాగుతాయి.

మెకానికల్‌గా క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇందులో 349cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ J-సిరీస్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 6,100 rpm వద్ద 20.2 PS పవర్, 4,000 rpm వద్ద 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతగా ఉంది.

ఇంజిన్‌ను తక్కువ RPMల వద్ద మెరుగైన టార్క్ అందించేలా ట్యూన్ చేశారు. వాస్తవ రైడింగ్ పరిస్థితుల్లో సుమారు 35 నుండి 40 kmpl మైలేజ్ లభిస్తుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ చెబుతోంది. బైక్‌లో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను అందించారు. దీంతో క్లచ్ ఆపరేషన్ తేలికగా మారడంతో పాటు గేర్ షిఫ్టింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. అదనంగా USB టైపు-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఈ మోటార్‌సైకిల్‌ను ట్విన్ డౌన్‌ట్యూబ్ ఛాసిస్‌పై నిర్మించారు. నగర రోడ్లు, హైవే రైడింగ్‌కు అనుగుణంగా సస్పెన్షన్‌ను తయారు చేశారు. బైక్ కర్బ్ వెయిట్ సుమారు 195 కిలోలు ఉంటుంది. అలాగే ఇందులో న్యూట్రల్ రైడింగ్ పొజిషన్, వెడల్పాటి హ్యాండిల్‌బార్లు, మిడ్ మౌంటెడ్ ఫుట్‌పెగ్స్ ఉన్నాయి. ఇవి రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్లలోనూ మెరుగైన కంఫర్ట్ అందించేలా రూపొందించారు.

గూర్ఖా కలెక్షన్

క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్‌తో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేకంగా గూర్ఖా కలెక్షన్‌ను కూడా లాంచ్ చేసింది. ఇందులో రైడింగ్ గేర్, దుస్తులు, యాక్సెసరీస్, కలెక్టబుల్స్ ఉన్నాయి. ఈ కలెక్షన్‌లో జెట్, క్వెస్ట్ హెల్మెట్లు, లెదర్ బూట్లు, హెడ్‌గేర్, దుస్తులు, ఇతర ప్రత్యేక వస్తువులు ఉన్నాయి. గూర్ఖా రెజిమెంట్ ఇన్‌సిగ్నియా, మిలిటరీ యూనిఫామ్ డిజైన్లు, క్రాస్‌డ్ ఖుక్రి గుర్తు వంటి అంశాల నుంచి వీటి డిజైన్‌కు స్ఫూర్తి పొందినట్లు కంపెనీ తెలిపింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్ ధర రూ.2,10,684 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us