పిల్లలను మెల్లగా ఫోన్‌కు దూరం చేయాలనుకుంటున్నారా? ఈ టిప్స్‌ మీ కోసమే!

చిన్నారుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకం అతిగా మారి, కంటి సమస్యలు, నిద్రలేమి వంటివి పెంచుతోంది. తల్లిదండ్రులు స్క్రీన్ టైమ్ పరిమితి విధించడం, ప్రత్యామ్నాయ కార్యకలాపాలకు ప్రోత్సహించడం, పేరెంటల్ కంట్రోల్ వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్‌ను బహుమతిగా ఇవ్వకుండా, సమతుల్య వినియోగాన్ని నేర్పించడం ద్వారా పిల్లలను ఈ వ్యసనం నుండి కాపాడవచ్చు.

పిల్లలను మెల్లగా ఫోన్‌కు దూరం చేయాలనుకుంటున్నారా? ఈ టిప్స్‌ మీ కోసమే!
Smartphone Addiction

Updated on: Feb 28, 2026 | 9:43 PM

చిన్నారుల్లో స్మార్ట్‌ఫోన్‌కు విపరీతంగా ఎడిక్ట్‌ అవుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, గేమ్స్, వీడియోల కారణంగా పిల్లలు గంటల తరబడి ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. దీని వల్ల కంటి సమస్యలు, నిద్రలేమి, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని బాల వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు ఫోన్‌కు అడిక్ట్ కాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మొదటగా పిల్లలకు రోజువారీ స్క్రీన్ టైమ్‌కు స్పష్టమైన పరిమితి విధించడం చాలా అవసరం. చిన్నారులకు రోజుకు 1–2 గంటలకు మించకుండా ఫోన్ వాడకం ఉండేలా నియమం పెట్టాలి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు నిరంతరం ఫోన్ వాడకాన్ని తగ్గిస్తే, వారు అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రెండవది పిల్లలను ప్రత్యామ్నాయ కార్యకలాపాల వైపు మళ్లించడం కీలకం. బయట ఆటలు, పుస్తక పఠనం, డ్రాయింగ్, సంగీతం వంటి హాబీలకు ప్రోత్సాహం ఇస్తే, ఫోన్‌పై ఆసక్తి సహజంగానే తగ్గుతుంది. ముఖ్యంగా కుటుంబంతో కలిసి గడిపే సమయాన్ని పెంచితే, పిల్లలు డిజిటల్ ప్రపంచం నుంచి దూరంగా ఉంటారు. మూడవది ఫోన్‌ను బహుమతిగా లేదా శాంతింపజేసే సాధనంగా ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేస్తే పిల్లల్లో మొబైల్‌పై మానసిక ఆధారపడటం పెరుగుతుంది. అవసరమైతే పేరెంటల్ కంట్రోల్ యాప్‌లు ఉపయోగించి, వారు చూస్తున్న కంటెంట్‌ను పర్యవేక్షించాలి. స్మార్ట్‌ఫోన్ పూర్తిగా నిషేధించడం కంటే, సమతుల్య వినియోగాన్ని అలవాటు చేయడం ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రుల జాగ్రత్తలు, సమయ నియంత్రణ, ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవే పిల్లలను ఫోన్ అడిక్షన్ నుంచి కాపాడే కీలక ఆయుధాలు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us