
ఇప్పటిరోజుల్లో ప్రతీఒక్కరూ స్మార్ట్‌ఫోన్ అనేది వాడుతుంటారు. ఎవరి చేతుల్లో చేసినా ఏదొక స్మార్ట్‌ఫోన్ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఫోన్ వాడే ప్రతీఒక్కరికీ ఛార్జర్ అనేది అవసరం. ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే పవర్ లేకపోతే ఛార్జింగ్ ఎలా చేసుకోవాలనే ఐడియా చాలామందికి ఉండదు. పవర్ ఎప్పుడు వస్తుందా అని ఆందోళన చెందుతుంటారు. కానీ కరెంట్ లేకపోయినా మీరు మీ ఫోన్‌ను సులువుగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందుకు ఐదు మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అవేంటి అనేది క్లియర్‌గా ఇందులో చూద్దాం.
ప్రస్తుతం అతి తక్కవ ధరకే పవర్ బ్యాంక్‌లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ ప్రముఖ బ్రాండ్ల పవర్ బ్యాంక్‌లు చౌక ధరకే లభిస్తున్నాయి. రూ.వెయ్యిలోపు ధరల్లోనే మంచి పవర్ బ్యాంక్‌లు దొరుకుతున్నాయి. దీంతో కరెంట్ ఉన్నప్పుడు మీరు దానికి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటే.. పవర్ లేనప్పుడు దాని ద్వారా మీ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో ఫోన్ ఎక్కువగా ఉపయోగించే తప్పనిసరిగా పవర్ బ్యాంక్ ఉంచుకోవడం ఉత్తమం.
ఇక మీ దగ్గర ల్యాప్ టాప్ ఉంటే దాని ద్వారా ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ప్రతీ ల్యాప్‌టాప్‌కు తప్పనిసరిగా యూఎస్‌బీ పోర్ట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఛార్జింగ్ కేబుల్ యూఎస్‌బీ పోర్ట్‌కు కనెక్ట్‌కు ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయితే ల్యాప్ టాప్ ద్వారా ఛార్జింగ్ చాలా స్లోగా అవుతుంది.
ఇటీవల మార్కెట్లో పోర్టబుల్ సోలార్ ఛార్జర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి ద్వారా పవర్ లేనప్పుడు ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇవి సూర్యరశ్మిని ఉపయోగించుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. దీని ద్వారా మీ ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు.
ప్రస్తుతం వచ్చే ప్రతీ కారులో యూఎస్‌బీ పోర్ట్ అనేది ఉంటుంది. ఈ పోర్ట్‌కు కేబుల్ కనెక్ట్ చేసి ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కొన్ని కార్లలో ఫోన్ల ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా మొబైల్ చార్జింగ్ సాకెట్ ఉంటుంది.
ఇటీవల కొత్తగా వచ్చే చాలా ఫోన్లలో రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది. అంటే ఆ ఫోన్ నుంచి కేబుల్ ద్వారా మరో ఫోన్‌కు కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీ కుటుంబసభ్యులు, స్నేహితుల ఫోన్లలో ఇలాంటి ఫీచర్ ఉంటే.. వారి ఫోన్ ద్వారా మీ ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు. కొన్ని ఫోన్లలో వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఆ ఫోన్ వెనుక భాగంలో బ్యాటరీ దగ్గర మీ ఫోన్ బ్యాటరీ ఉంచితే ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది.