పోకో నుంచి సరికొత్త పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ M8 పవర్ 5G.. ఫీచర్లు తెలిస్తే షాకవుతారు

ప్రముఖ బ్రాండ్ పోకో నుంచి కొత్తగా రానున్న 'POCO M8 Power 5G' స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. “Power Your Binge” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ ఫోన్ ఆగస్టు 4న భారత్‌లో విడుదల కానుంది. ఎక్కువసేపు వీడియోలు, సినిమాలు చూసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సరికొత్త డివైజ్ విశేషాలను తెలుసుకుందాం!

పోకో నుంచి సరికొత్త పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ M8 పవర్ 5G.. ఫీచర్లు తెలిస్తే షాకవుతారు
Poco M8 Power 5g

Updated on: Aug 01, 2026 | 6:30 AM

సాధారణ వినియోగంలో మూడు రోజుల వరకు బ్యాకప్ అందించే ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీతో POCO M8 Power 5G స్మార్ట్‌ఫోన్ రూపుదిద్దుకుంటోంది. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో సంచలనం సృష్టించనున్న ఈ పోకో M8 పవర్ 5G పూర్తి వివరాలను తెలుసుకుందాం!

డిస్‌ప్లే ప్రత్యేకతలు

పోకో (POCO) నుండి కొత్తగా వస్తున్న ‘POCO M8 Power 5G’ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం POCO M8s 5Gను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు M8 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను తీసుకురానుంది. ఆగస్టు 4న ఈ ఫోన్ భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. “Power Your Binge” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఫోన్‌ను ఎక్కువసేపు వీడియోలు, సినిమాలు చూసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 8,000mAh భారీ బ్యాటరీ. కంపెనీ ప్రకారం ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉండనుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో వీక్షణ మరింత స్మూత్‌గా ఉండనుంది. అమోలెడ్ ప్యానెల్ కారణంగా మరింత ప్రకాశవంతమైన రంగులు మరియు మెరుగైన విజువల్ అనుభవం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

శక్తివంతమైన ప్రాసెసర్

టీజర్‌లో కనిపించిన డిజైన్ ప్రకారం, ఫోన్ వెనుక భాగంలో ఆరెంజ్ టెక్స్చర్డ్ ఫినిష్ ఇవ్వనున్నారు. రౌండెడ్ రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు ఏఐ కెమెరా ఫీచర్లు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉండనున్నాయి. దీంతో ఫోటోగ్రఫీ అనుభవం మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. పనితీరు విషయానికి వస్తే, POCO M8 Power 5Gలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 4 చిప్‌సెట్ ఉండనుంది.

ఈ ప్రాసెసర్ రోజువారీ పనులతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు మెరుగైన పనితీరును అందించే అవకాశం ఉంది. ఈ మొబైల్ విడుదల తర్వాత ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. దీని ధర, ర్యామ్-స్టోరేజ్ వేరియంట్లు, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి పూర్తి వివరాలను కంపెనీ లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us