
హోలీ పండుగను పురస్కరించుకుని చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Oppo తన రెనో, ఫైండ్ ఎక్స్ సిరీస్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. పరిమిత కాలానికి వినియోగదారులకు నో-కాస్ట్ EMI, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఆఫర్లు ఆకర్షణీయంగా మారనున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్ఠంగా 24 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం అందిస్తోంది. Oppo Reno 15 Pro Mini (256GB, 512GB) వేరియంట్‌లపై 24 నెలల EMI లభిస్తుండగా, Oppo Reno 15 అన్ని వేరియంట్‌లపై 15 నెలల EMI అందుబాటులో ఉంది. అలాగే Oppo Find X9పై 18 నెలల వరకు నో-కాస్ట్ EMI అందిస్తోంది. బడ్జెట్ సెగ్మెంట్‌లోని Oppo A6, Oppo A6 Pro మోడళ్లపై వరుసగా 6 నెలలు, 8 నెలల EMI ఎంపికలు ఉన్నాయి.
ఇక కొనుగోలుదారులను మరింత ఆకర్షించేందుకు కంపెనీ గరిష్ఠంగా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా ప్రకటించింది. SBI, Axis, Bank of Baroda, Federal, DBS, IDFC First, Kotak Mahindra, Yes Bank క్రెడిట్ కార్డులతో పాటు UPI లావాదేవీలపై కూడా ఈ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. ధరల విషయానికి వస్తే Reno 15 Pro Mini ప్రారంభ ధర రూ.53,999 కాగా, Reno 15 ధర రూ.41,399 నుంచి మొదలవుతుంది. Pro Miniలో 200MP కెమెరా ఉండగా, Reno 15లో 50MP కెమెరా ఉంది. మరోవైపు Find X9 ప్రారంభ ధర రూ.69,499గా నిర్ణయించారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో 120Hz AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 9500 ప్రాసెసర్, 7025mAh బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. మొత్తంగా హోలీ సీజన్‌ను టార్గెట్ చేస్తూ ఒప్పో తీసుకొచ్చిన ఈ ఆఫర్లు మధ్యతరగతి నుంచి ప్రీమియం వినియోగదారులను ఆకర్షించే అవకాశముందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి