Twitter: ట్విట్టర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఎన్నాళ్లో వేచి చూస్తున్న ఆ ఫీచర్‌ వచ్చేస్తోంది..

|

Sep 02, 2022 | 8:53 AM

Twitter: మైక్రో బ్లాఇంగ్ సైట్‌ ట్విట్టర్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్య ప్రజల నుంచి దేశాధినేతల వరకు ట్విట్టర్‌ను ఉపయోగించే వారే. సినీ, రాజకీయ ప్రముఖులు..

Twitter: ట్విట్టర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఎన్నాళ్లో వేచి చూస్తున్న ఆ ఫీచర్‌ వచ్చేస్తోంది..
Twitter New Feature
Follow us on

Twitter: మైక్రో బ్లాఇంగ్ సైట్‌ ట్విట్టర్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్య ప్రజల నుంచి దేశాధినేతల వరకు ట్విట్టర్‌ను ఉపయోగించే వారే. సినీ, రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలను ట్విట్టర్‌లోనే షేర్‌ చేసుకుంటుంటారు. అందుకే ఈ సోషల్‌ మీడియా సైట్‌కు ఎక్కడ లేని ఫాలోయింగ్‌ ఉంది. గత కొన్ని రోజులు ట్విట్టర్‌ కొనుగోలు విషయంలో వార్తల్లో నిలవగా తాజాగా కొత్త ఫీచర్‌తో మరోసారి వార్తల్లోకెక్కింది.

సాధారణంగా ఏదైనా ట్వీట్ చేసిన తర్వాత దానిని ఎడిట్ చేసే ఆప్షన్‌ లేదు. ఒకవేళ చేసిన ట్వీట్‌లో ఏదైనా తప్పు దొర్లితే సదరు ట్వీట్‌ను డిలీట్‌ చేసిన మళ్లీ కొత్తగా పోస్ట్‌ చేయాల్సిందే. అయితే తాజాగా ఈ సమస్యకు చెక్‌ పెడుతూ ట్విట్టర్‌ ఎడిట్‌ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. గతంలోనే ఈ విషయాన్ని ప్రకటించిన ట్విట్టర్‌ తాజాగా ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఇప్పటికే ఎంపిక చేసిన కొందరు యూజర్లకు ఈ ఫీచర్‌ను అందించింది. అయితే ఈ ఎడిట్ ఆప్షన్‌ అందరికీ కాకుండా కేవలం సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న వారికి మాత్రమే అందించనున్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఈ విషయమై ట్విట్టర్‌ అధికారికంగా ట్వీట్‌ చేసింది.. ‘మీకు ఎడిట్‌ ఆప్షన్‌ కనిపిస్తోందా. మేము ఎడిట్ బటన్‌ ఫీచర్‌ను టెస్టింగ్‌ చేస్తున్నాము’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ ఫీచర్‌ను కేవలం సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వారికి మాత్రమే అందిస్తారా.? తర్వాత ఉచితంగా అందుబాటులోకి తెస్తారా.? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ట్విట్టర్‌ తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో గతకొన్ని రోజులుగా పడుతోన్న ఇబ్బందులకు చెక్‌ పడినట్లైంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..