
ఆకట్టుకునే డిజైన్, బ్లూటూత్ కాలింగ్, ఆరోగ్య సంరక్షణ ఫీచర్లతో వస్తున్న సరికొత్త స్మార్ట్‌వాచ్ టెక్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ వియరబుల్ బ్రాండ్ నాయిస్ విడుదల చేసిన ఈ ట్రెండింగ్ డివైజ్ సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభిస్తోంది. ఆకర్షణీయమైన ఈ నాయిస్ ట్విస్ట్ గో స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం!
ప్రస్తుత టెక్ యుగంలో చేతికి వాచ్ పెట్టుకోవడం అంటే కేవలం టైమ్ చూడటం మాత్రమే కాదు, అది మన ఫిట్‌నెస్, స్టైల్‌కి ఒక సింబల్ లాంటిది. అందులోనూ రౌండ్ డయల్ స్మార్ట్‌వాచ్‌లకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. సరిగ్గా తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ కోరుకునే వారి కోసం ప్రముఖ వియరబుల్ బ్రాండ్ నాయిస్ మార్కెట్‌లోకి తెచ్చిన లేటెస్ట్ గ్యాడ్జెట్ నాయిస్ ట్విస్ట్ గో రౌండ్ డయల్ స్మార్ట్‌వాచ్. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ గురించిన పూర్తి విశేషాలు చూద్దాం. ఈ స్మార్ట్‌వాచ్ మెయిన్ హైలైట్ దీని క్లాసిక్ రౌండ్ డిజైన్. దీనిని చేతికి పెట్టుకున్నప్పుడు ఇది ట్రెడిషనల్ వాచ్ లాగా కనిపిస్తుంది.
ఇందులో 1.39 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను ఇచ్చారు. దీనివల్ల స్క్రీన్ పై ఉన్న అక్షరాలు, నోటిఫికేషన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంతే కాకుండా దీని బ్రైట్‌నెస్ కూడా చాలా బాగుంటుంది. ఎండలో తిరిగేటప్పుడు కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాండ్‌గా ఉంటుంది. ఈ బడ్జెట్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ రావడం నిజంగా స్పెషల్.
ఈ వాచ్ ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ని కనెక్ట్ చేసి నేరుగా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. ఇందులో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ ఉండటం వల్ల వాయిస్ చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. అంతే కాకుండా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఆఫీస్‌లో బిజీగా ఉన్నప్పుడు ఫోన్ తీయకుండానే వాచ్‌తో కాల్స్ మాట్లాడటం చాలా సౌకర్యంగా ఉంటుంది.
మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఇందులో రకరకాల సెన్సార్లు ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్పీఓటూ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. అలాగే రోజువారీ వ్యాయామాలు, రన్నింగ్, వాకింగ్ వంటి వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ ద్వారా మీ ఫిట్‌నెస్‌ని ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ విషయంలో నాయిస్ వాచ్‌లు ఎప్పుడూ ముందుంటాయి. ఈ వాచ్ ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో రోజల తరబడి బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
ఇక స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే సోషల్ మీడియా నోటిఫికేషన్స్, వెదర్ అప్‌డేట్స్, అలారం, కెమెరా, మ్యూజిక్ కంట్రోల్ వంటి మరెన్నో యూజ్ ఫుల్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ట్రెండీ రౌండ్ డయల్ డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర మార్కెట్లో కేవలం రూ. 1,899 మాత్రమే. బడ్జెట్లో బెస్ట్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ కొనాలనుకునే వారికి ఇది ప్రస్తుతం అద్భుతమైన ఛాయిస్. మీరు దీనిని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు లేదా నాయిస్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు. ఇప్పుడే ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌ను కొనేయండి.