ఇంట్లోనే హోమ్ థియేటర్ అనుభూతి .. తక్కువ ధరలో4 కొత్త మోడళ్లతో దుమ్ము లేపుతున్న నాయిస్

స్మార్ట్‌వాచ్‌లు, ఈయర్‌బడ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నాయిస్ ఇప్పుడు హోమ్ ఆడియో విభాగంలోకి అడుగుపెట్టింది. హోమ్‌స్టేజ్ పేరుతో నాలుగు కొత్త సౌండ్‌బార్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.4,999 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో గరిష్ఠంగా 700W పీక్ అవుట్‌పుట్, Dolby Atmos, వైర్‌లెస్ రియర్ శాటిలైట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. చిన్న గది నుంచి హోమ్ థియేటర్ వరకు అవసరాలకు అనుగుణంగా మోడళ్లను ఎంచుకోవచ్చు.

ఇంట్లోనే హోమ్ థియేటర్ అనుభూతి .. తక్కువ ధరలో4 కొత్త మోడళ్లతో దుమ్ము లేపుతున్న నాయిస్
Noise Homestage Soundbar Series

Updated on: Oct 03, 2026 | 8:05 AM

టీవీలో సినిమాలు చూసేటప్పుడు మంచి సౌండ్ కోసం ప్రత్యేక స్పీకర్ సిస్టమ్‌ను కోరుకునేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారి కోసం నాయిస్ కొత్త HomeStage సిరీస్‌ను తీసుకొచ్చింది. మొత్తం నాలుగు మోడళ్లలో వేర్వేరు పవర్ స్థాయిలు, సౌండ్ సెటప్‌లు అందించారు. Bluetooth 5.3, HDMI ARC, ఆప్టికల్, USB, AUX వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ధరలు రూ.4,999 నుంచి రూ.24,999 వరకు ఉన్నాయి. అవసరాన్ని బట్టి మోడల్‌ను ఎంచుకోవచ్చు.

టాప్ మోడల్‌లో 700W పవర్..

HomeStage 5.2.4 ఈ సిరీస్‌లో టాప్ మోడల్. ఇది 700W పీక్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. Real Dolby Atmosతో పాటు నాలుగు హైట్ ఛానెల్స్ ఉండటంతో చుట్టూ నుంచి శబ్దం వస్తున్న అనుభూతిని అందించేలా దీన్ని రూపొందించారు. ఇందులో రెండు 6.5-అంగుళాల వైర్డ్ సబ్‌వూఫర్లు, వైర్‌లెస్ రియర్ శాటిలైట్లు ఉన్నాయి. టచ్ కంట్రోల్స్‌తో పాటు బేస్, ట్రెబుల్‌ను అవసరానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. పెద్ద గదిలో సినిమాలు, మ్యూజిక్ వినేందుకు ఎక్కువ పవర్ కావాలనుకునేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

రూ.4,999 నుంచి నాలుగు మోడళ్లు..

తక్కువ బడ్జెట్‌లో సౌండ్‌బార్ కావాలనుకునేవారి కోసం HomeStage 2.1 మోడల్ ఉంది. ఇది 90W అవుట్‌పుట్‌తో చిన్న గదులకు సరిపోయేలా ఉంటుంది. దీని ధర రూ.4,999. HomeStage 3.2 మోడల్ 200W అవుట్‌పుట్‌తో వస్తుంది. దీని ధర రూ.8,999గా ఉంది.

ఇక వైర్‌లెస్ రియర్ శాటిలైట్లతో వచ్చే HomeStage 5.1 మోడల్ 500W అవుట్‌పుట్‌ను అందిస్తుంది. దీని ధర రూ.14,999. టాప్ మోడల్ ధర రూ.24,999. సిరీస్‌లోని అన్ని మోడళ్లలో Bluetooth 5.3, HDMI ARC, ఆప్టికల్, USB, AUX కనెక్టివిటీ ఉన్నాయి. వార్తలు, మ్యూజిక్, సినిమాల కోసం వేర్వేరు కస్టమ్ EQ మోడ్‌లు కూడా అందించారు. నాయిస్ అధికారిక వెబ్‌సైట్‌లో వీటి విక్రయాలు అందుబాటులో ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us