Alexa: అమెజాన్‌ మరో అద్భుతం.. గొంతు మార్చుకోనున్న అలెక్సా.. ఇకపై మీకు నచ్చిన వారి గొంతుతో..

|

Jun 25, 2022 | 10:32 AM

Alexa: టెక్నాలజీ (Technology) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విప్లవం కూడా మారుతోంది. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీస్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ (AI), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌...

Alexa: అమెజాన్‌ మరో అద్భుతం.. గొంతు మార్చుకోనున్న అలెక్సా.. ఇకపై మీకు నచ్చిన వారి గొంతుతో..
Alexa Voice
Follow us on

Alexa: టెక్నాలజీ (Technology) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విప్లవం కూడా మారుతోంది. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీస్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ (AI), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IOT) ప్రముఖంగా చెప్పొచ్చు. భవిష్యత్తును ఏలేది ఈ టెక్నాలజీలేనని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సాంకేతికత ఆధారంగా రూపొందినవే వాయిస్‌ అసిస్టెంట్‌లు. అమెజాన్‌ అలెక్సా, గూగుల్ హోమ్‌, అమెజాన్‌ ఏకో వంటి వాయిస్‌ అసిస్టెంట్‌లు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వార్తల నుంచి మొదలు పాటల వరకు, వాతావరణ సమాచారం వరకు ఇలా ప్రతీ విషయాన్ని యూజర్లకు వినిపిస్తాయి ఈ వాయిస్‌ అసిస్టెంట్‌లు.

ఇదిలా ఉంటే తాజాగా అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌కు అధునాతన ఫీచర్‌ను జోడించే పనిలో పడింది. మనుషుల వాయిస్‌ను మిమిక్రీ చేసే విధంగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో మీకు నచ్చిన వ్యక్తుల గొంతుతో వాయిస్‌ కమాండ్స్‌ను వినొచ్చు. బతుకున్న వారితో పాటు, చనిపోయిన వారి వాయిస్‌ను కూడా అలెక్సాలో వినొచ్చు. ఇందుకోసం ముందుగా ఎవరి వాయిస్‌లో అయితే కమాండ్స్‌ రావాలనుకుంటున్నామో వారిని గొంతును రికార్డ్ చేయాలి.

ఆ తర్వాత సదరు శాంపిల్‌ వాయిస్‌ ఆధారంగా అలెక్సా తర్వాత ఇచ్చే కమాండ్స్‌ను అదే గొంతుతో వినిపిస్తుంది. అమెజాన్‌ ఇప్పటికే ఈ టెక్నాలజీపై డెమో కూడా నిర్వహించింది. లాస్‌ వెగాస్‌లో జరిగిన అమెజాన్‌ గ్లోబల్ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ కాన్ఫరెన్స్‌లో ఈ డెమోను నిర్వహించారు. మరికొన్ని రోజుల్లో అచ్చంగా మనుషుల్లా మాట్లాడే అలెక్సా అందుబాటులోకి రానుందన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..