Mobile Network Issues: జర్నీల్లో మీ మొబైల్‌ నెట్‌ వర్క్‌ మిస్‌ అవుతుందా? ఐతే మీ ఫోన్‌లో ఈ సెట్టింట్‌ మార్చేస్తే సరి

బస్సు, కారు, ట్రైన్‌.. ఇలా ఏదైనా వాహనంలో ప్రయాణించేటప్పుడు మీ మొబైల్‌లో నెట్‌వర్క్ సమస్యలు వస్తున్నాయా? చింతించకండి. ఈ కింది కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా మీ మొబైల్‌ సిగ్నల్‌ తిరిగి పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో 112ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Mobile Network Issues: జర్నీల్లో మీ మొబైల్‌ నెట్‌ వర్క్‌ మిస్‌ అవుతుందా? ఐతే మీ ఫోన్‌లో ఈ సెట్టింట్‌ మార్చేస్తే సరి
Mobile Network Issues

Updated on: Feb 13, 2026 | 12:04 PM

చాలా మంది దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు లేదా మారుమూల ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మొబైల్ నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాల్స్ డ్రాప్ అవ్వడం లేదా ఇంటర్నెట్ అంతరాయాలు కమ్యూనికేషన్ సమస్యలను కలిగిస్తాయి. అయితే మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సాధారణ సెట్టింగ్‌లను మార్చడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఉపయోగించడం

నెట్‌వర్క్ అకస్మాత్తుగా అదృశ్యమైతే మీ ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో 15 నుంచి 20 సెకన్ల పాటు ఉంచండి. ఆ తర్వాత దానిని తిరిగి సాధారణ మోడ్‌కు మార్చండి. ఇది మీ ఫోన్‌ను సమీపంలోని మొబైల్ టవర్‌కు తిరిగి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

మొబైల్‌ రీస్టార్ట్

ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ ఎర్రర్‌లు తొలగిపోతాయి. దీంతో మీ డివైజ్‌ మళ్లీ నెట్‌వర్క్ కోసం శోధించడం ప్రారంభిస్తుంది. ఇది అత్యంత ప్రభావవంతమైన, సులభమైన మార్గం. పైన పేర్కొన్న రెండు పరిష్కారాలు సహాయం చేయకపోతే సిమ్ కార్డును తీసి శుభ్రం చేసి, సరిగ్గా తిరిగి ఇన్‌సర్ట్ చేయాలి. దుమ్ము కణాలు అధికంగా పేరుకుపోతే సిమ్ కార్డు ఫోన్‌ను సరిగ్గా పనిచేయకుండా నిరోధిస్తాయి.

ఇవి కూడా చదవండి

మాన్యువల్ నెట్‌వర్క్ సెర్చింగ్

ఆటోమేటిక్ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేకపోతే మీ ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి మాన్యువల్ నెట్‌వర్క్ ఎంపిక చేసుకోవాలి. ఇది మీ ఫోన్‌ను అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌కు నేరుగా కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

బస్సు లేదా రైలులో ప్రయాణించేటప్పుడు వీలైతే కిటికీ దగ్గర సీటును ఎంచుకోండి. ఇది నెట్‌వర్క్ అడ్డంకులను తగ్గిస్తుంది. సిగ్నల్ పొందడంలో సహాయపడుతుంది. రైల్వే స్టేషన్లలో లేదా బహిరంగ ప్రదేశాలలో అందుబాటులో ఉన్న ఉచిత Wi-Fiని ఉపయోగించడం ద్వారా మీరు Wi-Fi కాలింగ్ ద్వారా కనెక్ట్ కావచ్చు. మీ సిమ్ కార్డుకు నెట్‌వర్క్ లేకపోయినా, అత్యవసర పరిస్థితుల్లో మీరు 112 కు డయల్ చేయవచ్చు. ఈ నంబర్ అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర కంపెనీ నెట్‌వర్క్‌ను ఉపయోగించి మీ కాల్‌ను కనెక్ట్ చేస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి.