WhatsApp: వాట్సాప్ యూజర్లకు ఊహించని షాక్.. ఉన్నట్టుండి అకౌంట్స్ బ్లాక్.. మెటా ఏమన్నందంటే?

రోజూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌తోనే మన జీవితం ముడిపడిపోయింది. అలాంటి వాట్సాప్ హఠాత్తుగా పనిచేయడం ఆగిపోతే? మీ అకౌంట్ బ్లాక్ అయింది.. 24 గంటలు ఆగండి అని స్క్రీన్‌పై మెసేజ్ పడితే ఏమవుతుంది? ఒక్కసారిగా గుండె గుభేల్ అంటుంది. కానీ సోమవారం రాత్రి మనదేశంలో ఎంతోమంది యూజర్లకు ఇదే జరిగింది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు ఊహించని షాక్.. ఉన్నట్టుండి అకౌంట్స్ బ్లాక్.. మెటా ఏమన్నందంటే?
Whatsapp Account Under Review Issue

Updated on: Aug 04, 2026 | 11:44 AM

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్ సోమవారం రాత్రి యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేదా హెచ్చరికలు లేకుండానే భారతదేశంతో సహా అనేక దేశాల్లోని పలువురి అకౌంట్లను 24 గంటల పాటు అండర్ రివ్యూలో ఉంచింది. అంతేకాకుండా యాప్‌లోని అన్ని ఫీచర్లను బ్లాక్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న యూజర్లు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి సుమారు 8:00 గంటల సమయంలో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది.

స్క్రీన్‌పై ఏం కనిపిస్తోంది?

బాధిత యూజర్లు వాట్సాప్ ఓపెన్ చేయగానే స్క్రీన్‌పై ‘‘Account in review… Your account activity and device info is being checked to make sure it follows our terms of service. We will notify you of the result typically within 24 hours’’ మీ అకౌంట్ పరిశీలనలో ఉంది. నిబంధనలను పాటిస్తున్నారో లేదో నిర్ధారించుకోవడానికి మీ అకౌంట్ యాక్టివిటీ, పరికర సమాచారాన్ని చెక్ చేస్తున్నాం. సాధారణంగా 24 గంటల్లో ఫలితాన్ని తెలియజేస్తాం’’ అనే మెసేజ్ దర్శనమిస్తోంది. దీని కిందే వాట్సాప్‌ను బాధ్యతాయుతంగా ఎలా వాడాలి, చోరీకి గురైన ఫోన్లు, అకౌంట్ల గురించిన మార్గదర్శకాల లింక్‌లను అందించారు.

సోషల్ మీడియాలో యూజర్ల ఆవేదన

ఉపాధి, రోజువారీ విధులు వాట్సాప్‌పైనే ఆధారపడిన చాలామంది యూజర్లు సోషల్ మీడియాలో తమ ఆందోళనను పంచుకున్నారు. ‘‘ఎలాంటి వార్నింగ్ లేకుండా నా వాట్సాప్ అకౌంట్ డిసేబుల్ అయింది. నేను కేవలం అఫీషియల్ యాప్‌నే వాడుతున్నాను. నా వర్క్ అంతా వాట్సాప్‌పైనే ఆధారపడి ఉంది, దయచేసి హెల్ప్ చేయండి’’ అని పోస్ట్ చేశారు. మరొక యూజర్ స్పందిస్తూ.. తాము ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించకపోయినా అకౌంట్‌ను అండర్ రివ్యూలో పెట్టారని, కేవలం 24 గంటల్లో రివ్యూ పూర్తి చేస్తామని జనరిక్ మెసేజ్ చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

స్పందించిన వాట్సాప్ ప్రతినిధి

ఈ ఆకస్మిక అంతరాయంపై వాట్సాప్ అధికారిక ప్రతినిధి స్పందించారు. ‘‘మా సేవలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవడానికి, ఇతర యూజర్ల భద్రతను కాపాడటానికి మేము నిరంతరం కృషి చేస్తాం. ఇందులో భాగంగా అకౌంట్లను బ్యాన్ చేస్తుంటాం. అయితే కొన్నిసార్లు పొరపాటున నిజమైన యూజర్ల అకౌంట్లు కూడా ప్రభావితమవుతాయి. అలా జరిగినప్పుడు, ఆ పొరపాటును సరిదిద్ది యూజర్లు మళ్లీ యథావిధిగా చాటింగ్ చేసుకునేలా త్వరగా రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాం’’ అని తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us