ప్రపంచంలో కెల్లా అత్యధిక డిజిటల్ నైపుణ్యాలు భారత్‌లోనే

| Edited By:

Apr 17, 2020 | 9:46 AM

ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే డిజిటల్ సామర్ధ్యాలు భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. పని ప్రదేశాల్లో కొత్త సాంకేతికతలు నేర్చుకోవడంలోనూ మన వాళ్లు ముందుంటున్నట్లు స్పష్టమైంది. మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)..

ప్రపంచంలో కెల్లా అత్యధిక డిజిటల్ నైపుణ్యాలు భారత్‌లోనే
Follow us on

ప్రపంచంలో ఎక్కువగా డిజిటల్ సామర్ధ్యాలు ఉపయోగించుకోవడంలో భారత్‌ ముందున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. పని ప్రదేశాల్లో కొత్త సాంకేతికతలు నేర్చుకోవడంలోనూ మన వాళ్లు ముందుంటున్నట్లు స్పష్టమైంది. మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి సరికొత్త సాంకేతికతలు తమ పని సాఫల్యతను పెంచుతున్నాయని భారత్‌లోని 67 శాతం మంది డిజిటల్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు ‘గార్ట్‌నర్ 2019 డిజిటల్ వర్క్‌ప్లేస్‌’ సర్వేలో వెల్లడైంది.

చైనా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, యూకేలతో పోలిస్తే సింగపూర్, భారత్‌లోని ఉద్యోగులు సామాజిక మాధ్యమాలు, రియల్ టైం మేనేజింగ్ యాప్‌లను అధికంగా ఉపయోగిస్తున్నట్లు గార్ట్‌నర్ రీసెర్చర్ రష్మీ చౌదరి తెలిపారు. వీటి ద్వారా ఉద్యోగుల మధ్య సహకారం పెరిగి డిజిటల్ సామర్థ్యాలు మెరుగుపడేలా తోడ్పడుతుందని ఆమె వెల్లడించారు. కొత్త సాంకేతికతను నేర్చుకోవడం వల్ల.. భారత్‌లోని 10 మందిలో ఏడుగురు ఉద్యోగులు కెరీర్‌ పరంగా ఉన్నత అవకాశాలు, మంచి శాలరీ అందుకుంటున్నారని రష్మీ చౌదరి పేర్కొన్నారు.

గార్ట్‌నర్ సర్వే కీ పాయింట్స్:

1. పనిలో ఉపయోగించే డిజిటల్ సాంకేతికతలో 27 శాతం మంది ఉద్యోగులు విశిష్ట నైపుణ్యం కనబరుస్తున్నారు.
2. ఏఐ, ఎంఎల్, ఐఓటీ వంటి సాంకేతికతల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యేందుకు 39 శాతం మంది ఉద్యోగులు ఓటీజే శిక్షణ కోరుకుంటున్నారు.
3. తమ వర్కింగ్ అలవాట్లను డిజిటల్ సాంకేతికతల ద్వారా పసిగట్టినా అభ్యంతరం లేదని 45 శాతం మంది ఉద్యోగులు స్పష్టం చేశారు.
4. డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి క్లాస్‌రూంలతో కూడిన ఆన్‌ ద జాబ్ ట్రైనింగ్, జస్ట్ ఇన్ టైం వంటి విధానాల ద్వారా శిక్షణ పొందడానికి మరికొంత మంది ఉద్యోగులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Read More:  

రికార్డు సృష్టించిన బంగారం.. రూ. 47 వేలకు చేరువ

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్

లాక్‌‌డౌన్‌ ఎఫెక్ట్: భారీగా తగ్గిన చమురు విక్రయాలు