Whatsapp Link Scam: వాట్సాప్‌లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే రూ.4 కోట్లు హాంఫట్.. హర్యానాలో వెలుగులోకి నయా స్కామ్

|

Oct 06, 2024 | 8:30 PM

ఇటీవల కాలంలో అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో స్కామర్లు వాట్సాప్‌కు లింక్స్ పంపడం ద్వారా సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. హర్యానాలోని పంచకులలోని డీఎల్‌ఎఫ్ వ్యాలీ నివాసి మహేంద్ర సింగ్ అనే రిటైర్డ్ బ్రిగేడియర్‌కు స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించి వాట్సాప్‌లో నోటిఫికేషన్ వచ్చింది.

Whatsapp Link Scam: వాట్సాప్‌లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే రూ.4 కోట్లు హాంఫట్.. హర్యానాలో వెలుగులోకి నయా స్కామ్
Whatsapp
Follow us on

ఇటీవల కాలంలో అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో స్కామర్లు వాట్సాప్‌కు లింక్స్ పంపడం ద్వారా సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. హర్యానాలోని పంచకులలోని డీఎల్‌ఎఫ్ వ్యాలీ నివాసి మహేంద్ర సింగ్ అనే రిటైర్డ్ బ్రిగేడియర్‌కు స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించి వాట్సాప్‌లో నోటిఫికేషన్ వచ్చింది. అతనికి వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. అందులో అతనికి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి కొన్ని చిట్కాలు అందించి అదే మెసేజ్‌లో యాప్‌నకు లింక్ కూడా ఉంది. ఆ లింక్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని అడిగారు. అక్కడి నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్ నుంచి అదనపు ఆదాయం పొందవచ్చని ఉండడంతో ఉత్సుకతతో మహేంద్ర సింగ్ ఆ లింక్‌ను క్లిక్ చేయడంతో రూ.4.2 కోట్లు నష్టపోయాడు. ఈ నేపథ్యంలో వాట్సాప్ లింక్ ద్వారా ఎలాంటి మోసానికి గురయ్యాడో? ఓసారి తెలుసుకుందాం.

మహేంద్ర సింగ్ తనకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను నమ్మి ఆ లింక్‌ను క్లిక్ చేసి వారు సూచించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేశాడు. ప్రారంభంలో అతను రూ. 1 కోటి (సుమారు 125,000 USD) కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. తరువాత, అతని భార్య కూడా పెట్టుబడి పెట్టింది. మొత్తం మీద ఇద్దరూ కలిసి 5,30,000 యూఎస్ డాలర్లు అంటే సుమారు రూ. 4.2 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే పెట్టుబడిపై లాభాలను ఆ యాప్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడంతో మహేంద్ర సింగ్ ఆ యాప్ నిజమని నమ్మాడు. అయితే తన పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు మోసగాళ్లు విత్‌డ్రా కోసం రూ.65 లక్షలు (సుమారు 81,250 డాలర్లు) కమీషన్ డిమాండ్ చేయడంతో ఆ యాప్‌పై అనుమానం కలిగింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మహేంద్ర సింగ్ హర్యానా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న హర్యానా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి షాకింగ్ విషయాలను కనుగొన్నారు. ఈ స్కామ్ పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలో భాగమని గుర్తించారు. నివేదిక ప్రకారం ఈ సంక్లిష్టమైన సైబర్ స్కామ్ సూత్రధారులు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నారని గుర్తించారు. 

దుండగులు పక్కా ప్రణాళికతో ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. మోసగాళ్లు సొమ్మును భారతదేశ సరిహద్దు గ్రామాల ప్రజల బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ డబ్బును వారికే బదిలీ చేసుకునేవారు. ఈ పని కోసం వారు ప్రతి లక్ష రూపాయలకు  ఖాతాదారులకు 4,000 నుండి 10,000 రూపాయల వరకు కమీషన్ కూడా ఇచ్చారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇద్దరు వ్యక్తులను ఇటీవల అరెస్టు చేశారు. వారిని మన్‌ప్రీత్ సింగ్, కర్నైల్ సింగ్‌లుగా గుర్తించారు. ఈ వ్యక్తులు ఇండో-పాకిస్తాన్ సరిహద్దులోని గ్రామాల నివాసితులు. తదుపరి విచారణ కోసం నాలుగు రోజుల పోలీసు రిమాండ్‌లో ఉంచారు. వీరిని అరెస్టు చేయడానికి విచారణలో భాగంగా ముందే మరో నలుగురు నిందితులను గుర్తించి ఇప్పటికే జైలుకు పంపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..