Smartphone Camera: స్మార్ట్‌ ఫోన్‌ కెమెరా విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? లెన్స్‌ పాడైపోయినట్లే..!

|

Nov 28, 2024 | 6:02 PM

Smartphone Camera Cleaning Tips: కెమెరా లెన్స్‌ను శుభ్రం చేయడానికి చాలా మంది సాధారణ నీటిని లేదా ఏదైనా రకమైన ద్రవాన్ని ఉపయోగిస్తారు. ఇది లెన్స్‌కు హానికరం. మీరు లిక్విడ్ క్లీనర్‌ను ఉపయోగించాల్సి వస్తే,

Smartphone Camera: స్మార్ట్‌ ఫోన్‌ కెమెరా విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? లెన్స్‌ పాడైపోయినట్లే..!
Follow us on

Smartphone Camera Cleaning Tips: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడే వారి సంఖ్య పెరిగిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసేముందు ముఖ్యంగా కెమెరా గురించి చూస్తున్నారు. ఫోటోలు మంచి క్లారిటీగా వచ్చే కెమెరా మొబైల్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫోటోలు తీసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమంటున్నారు టెక్‌ నిపుణులు. అద్భుతమైన ఫోటోలను తీయడానికి, ఫోన్ కెమెరా లెన్స్ శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. సరిగ్గా శుభ్రం చేస్తే కెమెరా పాడైపోవచ్చు లేదా దాని నాణ్యత ప్రభావితం కావచ్చు. ఈ విషయాలు అందరికి తెలియకపోవచ్చు. కెమెరాల విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ఫోన్‌ కెమెరా క్లీన్‌ చేయడానికి..

ఫోన్ కెమెరా లెన్స్ చాలా సున్నితంగా ఉంటుంది. దీన్ని శుభ్రం చేయడానికి ఎల్లప్పుడూ మైక్రోఫైబర్ క్లాత్‌ను ఉపయోగించండి. ఇది లెన్స్‌ను శుభ్రపరచడమే కాకుండా గీతలు పడకుండా కాపాడుతుంది. లెన్స్‌పై గీతలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఇతర క్లాత్‌ను ఉపయోగించకూడదంటున్నారు.

ఇవి కూడా చదవండి

కెమెరా లెన్స్‌పై ఎక్కువ ఒత్తిడి పెట్టవద్దు:

క్లాత్‌తో శుభ్రపరిచేటప్పుడు లెన్స్‌ను సున్నితంగా శుభ్రం చేయండి. ఎక్కువ ఒత్తిడి చేసినట్లయితే లెన్స్ చెడిపోయే అవకాశం ఉంది. లేదా కెమెరాపై ఉండే పూత దెబ్బతింటుంది.

లిక్విడ్ క్లీనర్‌ను తెలివిగా ఉపయోగించండి:

కెమెరా లెన్స్‌ను శుభ్రం చేయడానికి చాలా మంది సాధారణ నీటిని లేదా ఏదైనా రకమైన ద్రవాన్ని ఉపయోగిస్తారు. ఇది లెన్స్‌కు హానికరం. మీరు లిక్విడ్ క్లీనర్‌ను ఉపయోగించాల్సి వస్తే, ఎలక్ట్రానిక్ డివైజ్ క్లీనర్ లేదా లెన్స్ క్లీనర్‌ను మాత్రమే ఉపయోగించండి.

మీ వేళ్లతో లెన్స్‌ను తాకవద్దు:

చాలా సార్లు మనకు తెలియకుండానే వేళ్లతో లెన్స్‌ని తాకుతాం. ఇలా చేయడం వల్ల లెన్స్‌పై ఆయిల్, డస్ట్ పేరుకుపోయి ఫోటో నాణ్యతను పాడు చేస్తుంది.

దుమ్ము తొలగించడానికి బ్లోవర్ ఉపయోగించండి:

లెన్స్‌పై దుమ్ము పేరుకుపోయినట్లయితే దానిని శుభ్రం చేయడానికి ఎయిర్ బ్లోవర్‌ని ఉపయోగించండి. ఊదడం ద్వారా దానిని శుభ్రం చేయడానికి ప్రయత్నించవద్దు. ఇది లెన్స్‌పై తేమను కలిగిస్తుంది. మీ ఫోన్ కెమెరాను శుభ్రపరిచేటప్పుడు ఈ జాగ్రత్తలను అనుసరించండి. తద్వారా మీ కెమెరా చాలా కాలం పాటు సురక్షితంగా, ప్రభావవంతంగా ఉంటుంది. మంచి ఫోటోను క్యాప్చర్ చేయడానికి కెమెరా శుభ్రంగా, సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి