మీరు కొన్నేళ్లుగా ఒక్కటే ఫోన్‌ని ఉపయోగిస్తున్నారా? మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎక్కువ కాలం ఒక్కే ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఫోన్ స్లో అవుతూ ఉంటుంది. బ్యాటరీ డ్రైన్ అవ్వడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలను చిటికెలో పరిష్కరించవచ్చు.
స్టోరేజ్‌ని క్లియర్ చేయండి: ఫోన్ స్లో అయితే ఫోన్‌ని బూస్ట్ చేయాలనుకుంటే, ముందుగా మీరు ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. స్టోరేజ్ ఫుల్ కావడం వల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వడంతోపాటు స్లో అవుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే పనికిరాని ఫోటోలు, వీడియోలు, యాప్స్ వంటివి డిలీట్ చేయండి.
కాష్ మెమరీని క్లియర్ చేయండి: ఫోన్ కాష్ మెమరీని క్రమం తప్పకుండా క్లియర్ చేయండి, తద్వారా ఫోన్ వేగంగా పని చేస్తుంది. మీరు బ్రౌజర్, యాప్‌ల కాష్ ఫైల్‌లు, కుక్కీలను సకాలంలో క్లియర్ చేయకపోతే, ఫోన్ స్లో అవుతుంది.
వైరస్ స్కాన్ చేయండి: మీరు APK ద్వారా తెలియని సైట్ లేదా ఏదైనా యాప్ నుండి ఏదైనా ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే, అప్పుడు యాంటీవైరస్ సహాయంతో, ఫోన్‌లో వైరస్ ఉందో లేదో తనిఖీ చేయండి.. వైరస్ కారణంగా ఫోన్ కూడా స్లో అవుతుంది. అలా అయితే, యాంటీవైరస్ సహాయంతో వైరస్‌ను తొలగించండి.
సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి: ఫోన్ నెమ్మదిగా నడుస్తుంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కూడా ఒక కారణం కావచ్చు. ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి, ఫోన్‌కు ఏదైనా అప్‌డేట్ పెండింగ్‌లో ఉందో లేదో తనిఖీ చేయండి, అప్‌డేట్ చేయకుంటే వెంటనే ఫోన్‌ను అప్‌డేట్ చేయండి.