మీ ఫోన్‌కు రోజుకు ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలి..? ఈ తప్పులు చేస్తే బ్యాటరీ పని ఖతమే..

చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే రోజు గడవని కాలమిది. అయితే హెవీ వాడకం వల్ల బ్యాటరీ ఇట్టే దిగిపోవడం, మాటిమాటికీ ఛార్జర్‌ వెతుక్కోవడం చాలామందికి రోజూ ఎదురయ్యే తలనొప్పి. అసలు రోజుకు ఎన్నిసార్లు ఛార్జ్ చేయడం మంచిది? బ్యాటరీ హెల్త్‌ను కాపాడుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఇవే..

మీ ఫోన్‌కు రోజుకు ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలి..? ఈ తప్పులు చేస్తే బ్యాటరీ పని ఖతమే..
Phone Charging Mistakes

Updated on: Aug 22, 2026 | 8:57 PM

ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడకం ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగమైపోయింది. అయితే ఎక్కువసేపు వాడటం వల్ల బ్యాటరీ వేగంగా దిగిపోవడం కామన్‌గా మారింది. ఈ క్రమంలో రోజుకు రెండు మూడు సార్లు ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెడుతుంటారు. కానీ తరచుగా ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ పాడవుతుందా? రోజుకు ఎన్నిసార్లు ఛార్జ్ చేయడం సురక్షితం? అనే సందేహాలు చాలామందిని వేధిస్తుంటాయి. దీనిపై టెక్ నిపుణులు, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. టెక్ నిపుణుల ప్రకారం.. రోజుకు ఎన్నిసార్లు ఛార్జ్ చేశామనే విషయం ఆధునిక స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలను దెబ్బతీయదు. ప్రస్తుతం వచ్చే అన్ని మొబైల్స్‌లో లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నారు. వీటి ఆయుష్షు ఛార్జింగ్ పెట్టిన సంఖ్యపై కాకుండా ఛార్జ్ సైకిల్స్ ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. బ్యాటరీ మొత్తం 100శాతం సామర్థ్యాన్ని పూర్తిగా వాడినప్పుడే ఒక సైకిల్ పూర్తవుతుంది. కాబట్టి రోజులో 2 లేదా 3 సార్లు అవసరాన్ని బట్టి 15-20శాతం కొద్దికొద్దిగా ఛార్జ్ చేసుకోవడం పూర్తిగా సురక్షితం.

బ్యాటరీ లైఫ్ పెంచే 20-80 స్వర్ణ నియమం

బ్యాటరీ ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం కాపాడుకోవడానికి 20-80 నియమం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాటరీ పూర్తిగా 0 శాతం అయ్యే వరకు వాడటం వల్ల బ్యాటరీ సెల్స్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఛార్జింగ్ 20శాతానికి రాగానే ఛార్జింగ్ పెట్టాలి. ప్రతిసారీ బ్యాటరీని 100శాతం ఫుల్ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. 80 నుంచి 85శాతానికి రాగానే అన్‌ప్లగ్ చేయడం వల్ల బ్యాటరీ కెమికల్ ఏజింగ్ తగ్గుతుంది.

బ్యాటరీకి ప్రధాన శత్రువు హీట్ మాత్రమే

మొబైల్ బ్యాటరీలు త్వరగా పాడవడానికి ఛార్జింగ్ సంఖ్య కంటే అధిక వేడి ప్రధాన కారణం. ఛార్జింగ్ సమయంలో ఫోన్ తీవ్రంగా వేడెక్కితే బ్యాటరీ సామర్థ్యం శాశ్వతంగా దెబ్బతింటుంది.

  • ఎండ తగిలే ప్రదేశాల్లో లేదా వేడిగా ఉండే ప్రాంతాల్లో ఫోన్ ఛార్జ్ చేయకూడదు.
  • ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు గేమ్స్ ఆడటం, హెవీ టాస్క్‌లు చేయడం మానుకోవాలి.
  • మొబైల్ బాగా వేడెక్కితే బ్యాక్ కవర్ తొలగించి ఛార్జ్ చేయాలి.

ఒరిజినల్ ఛార్జర్‌లనే వాడండి

ఫోన్ సురక్షితంగా ఉండాలంటే కంపెనీ సూచించిన లేదా బ్రాండెడ్ ఒరిజినల్ అడాప్టర్, కేబుల్స్ మాత్రమే ఉపయోగించాలి. లోకల్, నాసిరకం చౌక ఛార్జర్లు వాడటం వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఏర్పడి బ్యాటరీ ఉబ్బిపోవడం లేదా మదర్‌బోర్డ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. 0 నుంచి 100శాతం వరకు ఎక్కువసేపు కాకుండా అవసరమైనప్పుడు చిన్న చిన్న విరామాలలో ఛార్జ్ చేయడమే స్మార్ట్‌ఫోన్‌కు మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us