Emergency sticker: ఈ చిన్న స్టిక్కర్ మీ బండికుంటే.. ప్రాణాలకు డోకాలేనట్టే!

ఒక చిన్న స్టిక్కర్.. ఎమర్జెన్సీ సమాయాల్లో మీ ప్రాణాలు కాపాడేందుకు సహాయపడుతుంది అంటే మీరు నమ్ముతారా? కచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఇకోభారత్, నేక్‌ఇన్సాన్‌ అనే సంస్థలు అందిస్తున్న ఈ ఎమర్జెన్సీ స్టిక్కర్‌లు ప్రమాదం సమయాల్లో మీకు సరైన వైద్యం అందేందుకు తోల్పడడంతో సహాయపడి.. మీ ప్రాణాలు రక్షించడంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతకు ఇవి ఎలా పనిచేస్తాయనేగా మీ డౌట్ అయితే తెలుసుకుందాం పదండి.

Emergency sticker: ఈ చిన్న స్టిక్కర్ మీ బండికుంటే.. ప్రాణాలకు డోకాలేనట్టే!
Ecobharat Qr Sticker

Updated on: Feb 15, 2026 | 5:31 PM

దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున కూడా పడుతున్నాయి. అయితే ఈ ప్రమాదాల్లో ఎక్కవగా మరణాలు సంభవించడానికి ప్రధాన కారణం సరైన సమయంలో చికిత్స అందకపోవడం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్థానిక వాహనదారులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించినా, మెరుగైన చికిత్స కోసం వారి బంధువుల వివరాలు తెలియక నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. దీని వల్ల క్షతగాత్రులకు సరైన సమయంలో చికిత్స అందక వారు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ సమస్యపై దృష్టి సారించిన ఇకోభారత్, నేక్‌ఇన్సాన్‌ అనే సంస్థలు దీని పరిష్కారానికి సరికొత్త మార్గాన్ని అన్వేషించారు. అదే ఎమర్జెన్సీ స్టిక్కర్.. ఈ సంస్థలు అందించే స్టిక్కర్‌ను ఒక్కసారి మీ బండికి అతికించుకుంటే.. మీకు ఎమర్జెన్సీ సమయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుఉతంది. ఇందుకోసం మీరు ఈ స్టిక్కర్‌ను మీ బైక్‌కు అతికింది దానికి మొబైల్‌ ద్వారా స్కాన్ చేసి మీ పూర్తి వివరాలు సబ్మిట్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.

ఎమర్జెన్సీ స్టిక్కర్ ఎలా పనిచేస్తుంది.

ఈ స్టిక్కర్‌ను మీరు వాహనాలకు అతికించుకోవడం ద్వారా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికులు ఈ క్యూఆర్ స్టిక్కర్ స్కాన్ చేస్తే మీ పూర్తి వివరాలు వస్తాయి. తద్వారా వారు మీ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సమాచారం అందిస్తారు. అంతేకాదు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే సెలెక్టెడ్ కుటుంబ సభ్యులకు డైరెక్ట్‌గా కాల్ వెళ్తోంది. దాంతో పాటు స్థానిక అంబులెన్స్‌కు కూడా కాల్ వెళ్తోంది. ఈ ప్రక్రియ క్షతగాత్రులకు తక్షన సహాయం అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం ద్వారా టైం వేస్ట్ కాకుండా సకాలంలో వైద్యం అంది ప్రాణాలు రక్షించే అవకాశం ఉంటుంది.

ఈ స్టిక్కర్ దర ఎంతో తెలుసా?

అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎమర్జెన్సీ స్టిక్కర్ ధర చాలా ఎక్కువగా ఉండొచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇకోభారత్, నేక్‌ఇన్సాన్‌ అనే సంస్థలు కేవలం రూ.99కే ఈ స్టిక్కర్‌ను అందిస్తారు. దీన్ని ఒక్కసారి తీసుకొని రిజిస్టర్ అయితే సుమారు ఐదేళ్ల వరకు పనిచేస్తుంది. తర్వాత మీరు మళ్లీ అప్డేట్ చేసుకోవాల్సి ఉండొచ్చు!

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.