యాపిల్ ఐఫోన్ భద్రతకు పెట్టింది పేరు. వినియోగదారుని ప్రైవసీ, డేటాకు అత్యంత పటిష్ట భద్రతను అది అందిస్తుంది. అందుకోసం ప్రత్యేకమైన సాఫ్టవేర్ ఫోన్ లో ఉంది. ఐఫోన్ కేవలం వినియోగదారుడు ఏర్పాటు చేసుకున్న పాస్ వర్డ్ నుంచి మాత్రమే యాక్సెస్ చేయడానికి వీలుంటుంది. ఒకవేళ అది ఎవరి చేతుల్లోకి వెళ్లినా దానిని వినియోగించాలంటే ఆ పాస్ వర్డ్ తెలియాల్సిందే. మరి అంత హై సెక్యూరిటీ మెయింటేన్ చేసే యాపిల్ ఐఫోన్ నుంచే ఓ దొంగ చాకచక్యంగా డబ్బు కాజేశాడు. ఓ మహిళ నుంచి ఫోన్ లాక్కొని, దానిని నుంచి తన అకౌంట్లను హ్యాక్ చేసి ఏకంగా రూ. 8లక్షలు కాజేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించిన దాని ప్రకారం మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌కు చెందిన రెహాన్ అయాస్ అనే మహిళ వీకెండ్ పార్టీకి ఓ క్లబ్ కి వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మాటల్లో పెట్టి ఎంచక్కా ఆమె ఐఫోన్ 13 ప్రో మాక్స్ ను లాక్కొని పరారయ్యాడు. అయితే ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆ మహిళ ఇతర పరికరాల నుంచి తన ఫోన్ బ్లాక్ చేయాలని ప్రయత్నించింది. డేటాను చోరీ కాకుండా కాపాడుకోవాలని ట్రై చేసింది. ఫోటోలు, వీడియోలు ట్రాష్ చేయడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికీ ఆ వ్యక్తి ఆ ఫోన్ పాస్ వర్డ్ మార్చేసి ఫోన్ మొత్తాన్ని తన ఆధీనంలో పెట్టేసుకున్నాడు. ఆ తర్వాతి రోజు తన ఖాతా నుంచి అదే ఫోన్ ద్వారా ఏకంగా 10,000 డాలర్లు అంటే అక్షరాల రూ. 8లక్షలు విత్ డ్రా అయినట్లు ఆ మహిళకు మెసేజ్ వచ్చింది.ఇదెలా సాధ్యమైందో అర్థం కాక ఆమె తల పట్టుకుంది
ఆ దొంగ ఆ ఫోన్ లాక్కోవడానికి ముందే ఆ మహిళపై రెక్కీ పెట్టి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆ మహిళను క్లోజ్ అబ్జర్వ్ చేసి, తన పక్కనే ఉంటూ తాను వినియోగిస్తున్న పాస్ వర్డ్స్ తెలుసుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. అంతేకాక ఫోన్ కాజేసింది ఒక్కడే అయినా.. ఇది తతంగం అంతా ఓ గ్రూప్ ఆపరేషన్ అయి ఉంటుందని వివరిస్తున్నారు. పాస్‌కోడ్‌ని తెలుసుకున్న తర్వాత, వారు ఐఫోన్‌ను దొంగిలించి, ఆపై పరికరానికి లాగిన్ చేసి, యాపిల్ ఐడి పాస్‌వర్డ్‌ను మార్చారు, తద్వారా బాధితుడురాలు దానిని యాక్సెస్ చేయలేకపోయారు. ఆ తర్వాత ఐఫోన్‌పై నియంత్రణ పొందిన తర్వాత, దొంగలు తమ బ్యాంక్ ఖాతాకు యాప్ లేదా ఆపిల్ ఐడిలో సేవ్ చేసిన ఆధారాల ద్వారా లాగిన్ చేసి, ఖాతాల నుండి డబ్బును లాగేశారు. సాధారణంగా ఐఫోన్ చోరీకి గురయితే.. చాలా వేరే డివైజ్ ద్వారా తమ ఖాతాలను లాగ్ అవుట్ చేయడం చేస్తుంటారు. అయితే ఇక్కడ ఆ మహిళ అప్పటికే దానిని ప్రయత్నించినా.. అప్పటికే దాని పాస్ వర్డ్ వారు మార్చేశారు.
ఐఫోన్‌ను దొంగిలించడం కొత్త కాదు. ఈ దొంగిలించబడిన ఐఫోన్‌లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడం జరగదు. అయినప్పటికీ అప్రమత్తత అవసరం. అందుకే ఫోన్ లకు పాస్ కోడ్ పెట్టుకోవడం మంచిదే అయినా పబ్లిక్ లో లేదా ఏదైనా గ్రూప్ పార్టీలలో ఫోన్ వినియోగించేటప్పుడు పాస్ కోడ్ కాకుండా అల్ఫా న్యూమరిక్ పాస్ వర్డ్ .. ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ వంటివి సెటప్ చేసుకొని వాటిని వినియోగించాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..