
ప్రస్తుతం రైడర్లు కేవలం భద్రత మాత్రమే కాకుండా, సౌకర్యవంతమైన స్మార్ట్ ఫీచర్లు కూడా కోరుకుంటున్నారని గుర్తించిన హెడ్‌ఫాక్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఆ అవసరాలకు అనుగుణంగా టార్మాక్‌ను అభివృద్ధి చేసింది. ఈ హెల్మెట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటంతో మొబైల్ ఫోన్‌ను చేతిలో పట్టుకోకుండానే కాల్స్ మాట్లాడటం, మ్యూజిక్ వినడం, నావిగేషన్ సూచనలు పొందే అవకాశం ఉంటుంది.
ప్రయాణ సమయంలో రైడర్ దృష్టి రోడ్డుపైనే ఉండేలా ఇది సహాయపడుతుంది. టార్మాక్‌లో ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో మార్గం తెలియని ప్రాంతాల్లో కూడా సులభంగా ప్రయాణించవచ్చు. అలాగే హెడ్‌ఫాక్స్ ప్రత్యేకంగా రూపొందించిన బ్లింక్ స్లైడ్ టెక్నాలజీను కూడా ఇందులో అందించారు. ఇది రైడింగ్‌ను మరింత స్మార్ట్‌గా, సౌకర్యవంతంగా మార్చేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది.
డిజైన్ పరంగా కూడా ఈ హెల్మెట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. తేలికపాటి నిర్మాణం, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, లేటెస్ట్ స్టైలింగ్‌తో రూపొందించిన ఈ హెల్మెట్ ఎక్కువసేపు ధరించినా అసౌకర్యంగా అనిపించకుండా ఉండేలా తయారు చేశారు. అదే సమయంలో భద్రత, మన్నిక విషయంలో కూడా ఎలాంటి రాజీ పడలేదని సంస్థ తెలిపింది. భద్రతా ప్రమాణాల పరంగా టార్మాక్‌కు డాట్, ఐఎస్‌ఐ సర్టిఫికేషన్లు లభించాయి.
దీంతో అంతర్జాతీయ, భారతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ హెల్మెట్ తయారైనట్లు స్పష్టమవుతోంది. కొత్త హెల్మెట్ల విడుదల సందర్భంగా హెడ్‌ఫాక్స్ వ్యవస్థాపకుడు శుభమ్ చౌహాన్ కీలక విషయాలు వెల్లడించారు. రాబోయే రోజుల్లో హెల్మెట్లు కేవలం సేఫ్టీ కోసం మాత్రమే కాకుండా స్మార్ట్ రైడింగ్‌లో కీలక భాగంగా మారనున్నాయన్నారు.
ప్రస్తుత తరం వినియోగదారులు ప్రతి విషయంలో స్మార్ట్ టెక్నాలజీని ఆశిస్తున్నారని, అదే అనుభవాన్ని రైడింగ్ గేర్‌లో కూడా అందించాలన్న లక్ష్యంతో టార్మాక్‌ను రూపొందించామని చెప్పారు. భవిష్యత్తులో రైడర్ భద్రత, టెక్నాలజీ, డిజైన్ కలిసి ముందుకు సాగనున్నాయన్నారు. టార్మాక్ ఆ దిశగా తమ తొలి అడుగు వేసిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని స్మార్ట్ మొబిలిటీ ఉత్పత్తులను కూడా తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
భారత్‌లో టూవీలర్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, స్మార్ట్ హెల్మెట్లకు కూడా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని హెడ్‌ఫాక్స్ భావిస్తోంది. టార్మాక్ ద్వారా సంప్రదాయ హెల్మెట్‌ను ఆధునిక సాంకేతికతతో మేళవించి కొత్త తరహా రైడింగ్ అనుభూతిని అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.