Samsung Galaxy M14: తక్కువ ధరకే 5 జీ ఫోన్‌ కావాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌… సామ్‌సంగ్‌ ఎం14 ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌

|

Aug 16, 2023 | 4:15 PM

భారతదేశంలో సామ్‌సంగ్‌ కంపెనీ ఇటీవల విడుదల చేసిన సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 14 ధర తగ్గింది. ఈ బడ్జెట్ సామ్‌సంగ్‌ ఫోన్ భారతదేశంలో రూ. 14,990 ప్రారంభ ధర ట్యాగ్‌తో ప్రకటించారు. అయితే ఈ ఫోన్‌ సామ్‌సంగ్‌ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.12,490కు అందుబాటులో ఉంది. ప్రారంభం నుంచి సేల్స్‌లో దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎం 14 ఫోన్‌ ధర తగ్గడంతో ఈ ఫోన​ కొనుగోలుపై అందరూ ఆసక్తి చూపుతున్నారు.

Samsung Galaxy M14: తక్కువ ధరకే 5 జీ ఫోన్‌ కావాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌… సామ్‌సంగ్‌ ఎం14 ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌
Samsung Galaxy M14 5g
Follow us on

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగడంతో వివిధ కంపెనీలు కొత్త మోడల్స్‌ స్మార్ట్‌ ఫోన్లను విరివిగా రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే ఎన్ని కంపెనీల ఫోన్లు వచ్చినా భారతదేశంలో సామ్‌సంగ్‌ స్మార్ట్‌ ఫోన్లకు ఉన్న క్రేజ్‌ వేరు. ఎన్ని కంపెనీల ఫోన్లు వచ్చినా సామ్‌సంగ్‌ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసే వాళ్లు ఉన్నారంటే ఈ ఫోన్లకు ఉన్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. సామ్‌సంగ్‌ కంపెనీ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కొత్త మోడల్‌ ఫోన్లను తక్కువ ధరకే అందుబాటులో ఉంచుతుంది. భారతదేశంలో సామ్‌సంగ్‌ కంపెనీ ఇటీవల విడుదల చేసిన సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 14 ధర తగ్గింది. ఈ బడ్జెట్ సామ్‌సంగ్‌ ఫోన్ భారతదేశంలో రూ. 14,990 ప్రారంభ ధర ట్యాగ్‌తో ప్రకటించారు. అయితే ఈ ఫోన్‌ సామ్‌సంగ్‌ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.12,490కు అందుబాటులో ఉంది. ప్రారంభం నుంచి సేల్స్‌లో దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎం 14 ఫోన్‌ ధర తగ్గడంతో ఈ ఫోన​ కొనుగోలుపై అందరూ ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 5 జీ ఫోన్‌ గురించి మరిన్న వివరాలను తెలుసుకుందాం.

మెరుగైన బ్యాటరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 14 5జీ ఫోన్‌ బలమైన బ్యాటరీ జీవితం వినియోగదారులను కట్టి పడేస్తుంది. ఈ ఫోన్‌ మితమైన వినియోగంతో 2 రోజుల వరకు ఉంటుంది. ఈ ఫోన్‌లో వచ్చే 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కారణంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు ఫోన్‌లో చార్జింగ్‌ లేదని దిగులు పడాల్సిన అవసరం ఉండదు.

బడ్జెట్‌

ధర పరిధిని బట్టి ఈ ఫోన్‌ పనితీరు సంతృప్తికరంగా ఉంది. కేవలం రూ.12,490కు ఇంత అధునాతన ఫోన్‌ మార్కెట్‌లో అందుబాటులో లేదు. అయితే ఈ ఫోన్‌ సెట్టింగ్‌లు అత్యల్ప గ్రాఫిక్స్ ఎంపికకు సెట్  అయ్యాయి. అందువల్ల ఈ ఫోన్‌లో క్యాండీ క్రష్‌, అస్ఫాల్ట్‌-9 వంటి గేమ్‌లో హ్యాపీగా ఆడుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

ముఖ్యంగా ఈ ఫోన్‌  సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఈ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి తగినంత వేగంగా ఉంటుంది. 

డిస్‌ప్లే

ఈ ఫోన్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్ వార్మ్-టోన్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది కంటెంట్ వినియోగానికి సరిపోతుంది. ఎల్‌సీడీ ప్యానెల్ అయినప్పటికీ ఈ ఫోన్‌లో ఇది ఎటువంటి సమస్యలు లేకుండా సౌకర్యంగా ఉంటుంది. 

చార్జరే అసలు సమస్య

అయితే ఇటీవల అడాప్టర్‌ల వినియోగాన్నితగ్గించాలనే నిర్ణయంతో సామ్‌సంగ్‌ ఈ ఫోన్‌కు ఎలాంటి చార్జర్‌ను ఇవ్వడం లేదు. మనకు తప్పనిసరిగా చార్జర్‌ కావాలంటే ఎక్స్‌ట్రా సొమ్ము చెల్లించి చార్జర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌ 25 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది కాబట్టి ఆ పవర్‌కు అనుగుణంగా చార్జర్‌ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..