కార్బన్ డై ఆక్సైడ్ కి చెక్.. పర్యావరణానికి బూస్ట్

|

Jun 13, 2019 | 7:20 PM

ప్రపంచ దేశాల్లో పర్యావరణం దారుణంగా దెబ్బ తింటోంది. వాతావరణంలో ఒక్క గత నెలలోనే హానికారక కార్బన్ డై ఆక్సైడ్ మిలియన్ కు 415 భాగాలకు పైగా మించిపోయింది. ఇది మానవ చరిత్రలోనే అత్యధికమని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు క్లైమేట్ క్రైసిస్ దిశగా పయనిస్తున్నాయని వారంటున్నారు. . దీనికి చెక్ చెప్పి కార్బన్ వాయువులను తగ్గించాల్సి ఉందని, ఇందుకు మొదట వాతావరణం నుంచి పూర్తిగా కార్బన్ ను తొలగించి భూతలం లోపల ‘ […]

కార్బన్ డై ఆక్సైడ్ కి చెక్.. పర్యావరణానికి బూస్ట్
Follow us on

ప్రపంచ దేశాల్లో పర్యావరణం దారుణంగా దెబ్బ తింటోంది. వాతావరణంలో ఒక్క గత నెలలోనే హానికారక కార్బన్ డై ఆక్సైడ్ మిలియన్ కు 415 భాగాలకు పైగా మించిపోయింది. ఇది మానవ చరిత్రలోనే అత్యధికమని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు క్లైమేట్ క్రైసిస్ దిశగా పయనిస్తున్నాయని వారంటున్నారు. . దీనికి చెక్ చెప్పి కార్బన్ వాయువులను తగ్గించాల్సి ఉందని, ఇందుకు మొదట వాతావరణం నుంచి పూర్తిగా కార్బన్ ను తొలగించి భూతలం లోపల ‘ స్టోర్ ‘ చేయాలని వారు సూచిస్తున్నారు. ఇది ఓ సైన్స్ ఫిక్షన్ లా ఉండవచ్ఛు . కానీ భూమ్మీది చెట్లు ఈ పనిని ఇదివరకే చేస్తున్నాయి అన్నది వారి కొత్త వాదన. చెట్లు, మొక్కలు వెదర్ లోని కర్బనాన్ని పీల్చుకుని తమ వేళ్ళ ద్వారా భూమిలోకి పంపి దాన్ని నాశనం చేస్తున్నాయని వారు సూత్రీకరించారు. అందువల్లే కొన్ని కంపెనీలు తప్పనిసరిగా చెట్లను పెంచుతూ తరచూ తమ ఫ్యాక్టరీలు, సంస్థలనుంచి వెలువడే ఈ వాయువులను వాటికి వదిలివేస్తున్నాయని బోస్టన్ లోని ‘ ఇండిగో ఏజీ ‘ వెల్లడించింది. ఈ దిశగా ఈ సంస్థ వ్యవసాయ విధానాలను పూర్తిగా మార్చివేయడానికి పూనుకొంది. ప్రస్తుత పధ్ధతి ప్రకారం కాకుండా కొత్త విధానాలను సూచించింది. రైతులు తమ పాత విధానాలను మార్చుకునేలా వారికి ‘ టన్ను’ కార్బన్ డై ఆక్సైడ్ కు 15 డాలర్ల చొప్పున చెల్లిస్తామని డేవిడ్ పెర్రీ అనే ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకటించారు. తాము మొదట సుమారు మూడు వేలమంది రైతులకు శిక్షణ ఇస్తామని, వారి పొలాల్లోని కార్బన్ డై ఆక్సైడ్ ని చెట్లు పీల్చుకునేలా నిపుణులు సూచనలు, ఇస్తారని ఆయన చెప్పారు. ఈ ఏడాది పది లక్షలకు పైగా ఎకరాల్లో కర్బనం అన్నది లేకుండా చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. అయితే ఈ సరికొత్త కర్బన నిర్మూలన కార్యక్రమం ఫలవంతమవుతుందా అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో ఎప్పటికప్పుడు సంభవిస్తున్న మార్పులు కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణాలను పెంచుతూ పోతాయని, అలాంటప్పుడు ఇది ప్రకృతితో చేసే పోరాటంవంటిదేనని ఈ ‘ నిరాశావాదులు ‘ అంటున్నా వీరి వాదనను డేవిడ్ పెర్రీ కొట్టిపారేస్తున్నారు.