టచ్ స్క్రీన్.. ఇప్పుడీ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మనం ఉపయోగించే దాదాపు అన్ని వస్తువుల్లో ఈ టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, ట్యాబ్లెట్‌లు, ఏటీఎమ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే టచ్ స్క్రీన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న గ్యాడ్జెట్ల జాబితా చాలా పెద్దదే అని చెప్పాలి. వేళ్లను అలా అలా టచ్ చేస్తే చాలు ఎన్నో పనులను సులభంగా చేసుకునే రోజులివీ. అయితే స్క్రీన్‌ను తాకితే గ్యాడ్జెట్ ఎలా ఆపరేట్ అవుతుంది.? అసలు టచ్ స్క్రీన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది.? దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా టచ్ టెక్నాలజీకి ఉపయోగించే స్క్రీన్‌లపై మూడు లేయర్లు ఉంటాయి. వీటిలో మొదటిది పైన గ్లాస్, అడుగున డిస్‌ప్లే మధ్యలో కెపాసిటీవ్ టచ్ స్క్రీన్ ఉంటాయి. టచ్ స్క్రీన్ టెక్నాలజీలో ముఖ్యమైంది ఈ కెపాసిటీవ్ టచ్ స్క్రీన్ అని చెప్పాలి. కెసాసిటీవ్ టచ్ స్క్రీన్‌లో మొత్తం మూడు లేయర్లు ఉంటాయి. ఇందులో మొదటిది టాప్ గ్రిడ్, రెండోది క్లియర్ ఇన్సులేటర్ మూడోది బాటమ్ గ్రిడ్ లేయర్స్ ఉంటాయి. టాప్ గ్రిడ్ లేయర్‌లో పొడువు గీతలతో కూడిన కండెక్టివ్ మెటిరియల్, బాటమ్ గ్రిడ్‌లో అడ్డం గీతలతో కూడిన కండెక్టివ్ మెటిరియల్‌ను అమరుస్తారు.
ఈ రెండింటి కలయికతో బాక్సుల రూపం ఏర్పడుతుంది. స్క్రీన్ ఎక్కడ టచ్ చేసామన్న విషయాన్ని మ్యాపింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక ఈ రెండింటిని దూరం చేస్తూ మధ్యలో క్లియర్ ఇన్సూలేటర్ లేయర్ ఉంటుంది. మనం స్క్రీన్‌పై టచ్ చేయగానే వోల్టేజ్‌లో వచ్చే మార్పు కారణంగా ప్రాసెసర్‌కు సమాచారం అందిస్తుంది. దీంతో టచ్‌కు సంబంధించి నిర్ధేశించిన అవుట్ పుట్‌ను మొబైల్ ప్రాసెసర్ స్క్రీన్‌పై చూపిస్తుంది. ఇదండీ ఈ టెక్నాలజీ ఆధారంగానే టచ్ స్క్రీన్ పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..