Credit Card Calls: క్రెడిట్ కార్డ్ కాల్స్‌కు చెక్.. వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కీలక చర్యలు

|

Jun 22, 2024 | 5:15 PM

ఇటీవల కాలంలో ఫోన్ వాడకం అనేది సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఫోన్ ద్వారా మార్కెటింగ్ చేసే సంస్థలు కూడా పెరిగాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు కావాలా? లేదా లోన్స్ కావాలా? అంటూ వచ్చే కాల్స్ బాగా పెరిగాయి. ఈ కాల్స్ వినియోగదారులకు చికాకు తెప్పిస్తున్నాయి. ఎన్ని నెంబర్స్ బ్లాక్ చేసిన వేరే కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ రావడంతో ఈ సమస్యకు పరిష్కారం లేదని భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపించేలా కీలక చర్యలు తీసుకుంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Credit Card Calls: క్రెడిట్ కార్డ్ కాల్స్‌కు చెక్.. వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కీలక చర్యలు
Spam Calls
Follow us on

ఇటీవల కాలంలో ఫోన్ వాడకం అనేది సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఫోన్ ద్వారా మార్కెటింగ్ చేసే సంస్థలు కూడా పెరిగాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు కావాలా? లేదా లోన్స్ కావాలా? అంటూ వచ్చే కాల్స్ బాగా పెరిగాయి. ఈ కాల్స్ వినియోగదారులకు చికాకు తెప్పిస్తున్నాయి. ఎన్ని నెంబర్స్ బ్లాక్ చేసిన వేరే కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ రావడంతో ఈ సమస్యకు పరిష్కారం లేదని భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపించేలా కీలక చర్యలు తీసుకుంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రమోషనల్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌ల వంటి అయాచిత, అవాంఛిత వ్యాపార కమ్యూనికేషన్‌లను అరికట్టడానికి ముసాయిదా మార్గదర్శకాలపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూలై 21 వరకు ప్రజల అభిప్రాయాలను తెలపాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. వినియోగదారుల అభిప్రాయాలతో పాటు ఆయా సంస్థల అభిప్రాయాలను కూడా తెలుసుకున్న తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయోషనల్ కాల్స్‌తో పాటు టెక్స్ట్ మెసేజ్‌లపై ప్రభుత్వ చర్యల గురించి కీలక విషయాలను తెలుసుకుందాం.

ప్రమోషనల్, సర్వీస్ మెసేజ్‌ల వంటి వస్తువులు లేదా సేవలకు సంబంధించిన ఏదైనా కమ్యూనికేషన్‌గా నిర్వచించారు. కానీ ఇవి వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను మినహాయిస్తుంది. అయితే ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం ఏదైనా వ్యాపార కమ్యూనికేషన్‌ని గ్రహీత సమ్మతి లేదా నమోదిత ప్రాధాన్యతలకు అనుగుణంగా లేకుంటే అయాచిత, అవాంఛనీయమైనవిగా వర్గీకరిస్తారు. రిజిస్టర్ చేయని నంబర్‌లు లేదా ఎస్ఎంఎస్ హెడర్‌లను ఉపయోగించడం, గ్రహీతలు నిలిపివేసినప్పటికీ కాల్ చేయడం, డిజిటల్ సమ్మతిని పొందడంలో విఫలమవడం, కాలర్, ఉద్దేశ్యాన్ని గుర్తించకపోవడం, నిలిపివేసే ఎంపిక లేకపోవడం వంటి ఇతర షరతులు కమ్యూనికేషన్‌ను అనధికారికంగా చేస్తాయి. కస్టమర్ ప్రాధాన్యతల ఆధారంగా వాణిజ్య సందేశాలపై టెలికాం రెగ్యులేటర్ టెలికాం రెగ్యులేషన్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలను ఉల్లంఘించే కమ్యూనికేషన్‌లను కూడా ప్రతిపాదనలు నిషేధించాయి.

ట్రాయ్ 2018లో ఇచ్చిన నియమాలు రిజిస్టర్డ్ టెలిమార్కెటర్‌లకు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ప్రైవేట్ 10 అంకెల నంబర్‌లను ఉపయోగించి నమోదు చేయని విక్రయదారుల నుంచి కమ్యూనికేషన్‌లు నిరంతరాయంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. నమోదిత టెలిమార్కెటర్లకు డీఎన్‌డీ రిజిస్ట్రీ చాలా ప్రభావవంతంగా ఉంది. అయితే నమోదుకాని టెలిమార్కెటర్లు, 10-అంకెల ప్రైవేట్ నంబర్‌లను ఉపయోగిస్తున్న వారి నుంచి అనవసరమైన కమ్యూనికేషన్ కొనసాగుతుందని ట్రాయ్ ప్రతినిధులు వివరిస్తున్నారు. ప్రభుత్వం వినియోగదారుల ఆసక్తులు, వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉందని అందువల్ల ప్రమోషనల్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌ల విషయంలో కీలక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి